పెంచి పెద్దచేసిన కొడుకుతో కాపురం.. ప్రస్తుతం గర్భవతి

Thu Jul 16 2020 09:00:04 GMT+0530 (IST)

Kapuram with a raised son .. Currently pregnant

పాశ్చాత్య సంస్కృతిలో బంధాలు.. అనుబంధాలకు విలువ లేకుండా పోయింది. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఏకంగా పెంచి పెద్ద చేసిన కొడుకుతోనే కాపురం చేసి ప్రస్తుతం గర్భవతిగా ఉంది ఓ సెలెబ్రెటీ. ఈ దారుణం రష్యాలో చోటుచేసుకుంది.సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిన 35ఏళ్ల మెరీనా బల్మషేవ అనే యువతి కామంతో కళ్లు మూసుకొని పోయి ఏకంగా కొడుకుతోనే కాపురం పెట్టింది. 20 ఏళ్ల వ్లాదిమర్ వోయాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మెరీనా తన యుక్త వయసులోనే అలెక్స్ ఆరే అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరు ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని పెంచారు. పదేళ్ల పాటు వీరి సంసారం బాగా సాగింది. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు. కోర్టు ఐదుగురు పిల్లల బాధ్యతను తండ్రికి అప్పజెప్పింది. మెరీన్ ఓ చోట.. అలెక్స్.. అతడి ఐదుగురు పిల్లలు మరోచోట పెరిగారు. ఎవరి బతుకులు వారి బతుకుతున్నారు.

తాజాగా ఆలెక్స్ ఆరే పెద్ద కొడుకైన వ్లాదిమర్ వోయా తనను పెంచిన తల్లి మెరీనా ప్రేమలో కూరుకుపోయాడు. ఇద్దరు జనవరిలోనే పెళ్లికి రెడీ కాగా కరోనాతో వాయిదా పడింది. అప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు. గత వారమే కరోనా ఇక తగ్గదనుకొని రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ ఫొటోలను మెరీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొడుకును పెళ్లి చేసుకున్న ఆమెపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం గర్భవతి కూడా అయిన మెరినాను తప్పుడు పనిచేశావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

TAGS: Russia