Begin typing your search above and press return to search.

తొక్క‌కుండానే దూసుకెళ్లే సైకిల్‌.. వంద కిలోమీట‌ర్ల దాకా నాన్ స్టాప్!

By:  Tupaki Desk   |   20 April 2021 11:30 PM GMT
తొక్క‌కుండానే దూసుకెళ్లే సైకిల్‌.. వంద కిలోమీట‌ర్ల దాకా నాన్ స్టాప్!
X
సైకిల్ అంటే అందరికీ ఇష్ట‌మే. కానీ.. తొక్కాలంటేనే క‌ష్టం. తొక్క‌కుండా వెళ్లిపోతే.. సామిరంగా భ‌లేగా ఉంటుంది క‌దా! ఇదే ఆలోచ‌న వ‌చ్చింది ఓ కంపెనీకి. బ్యాట‌రీతో న‌డిచే సైకిల్ ను త‌యారు చేసింది. నెక్స్ జూ కంపెనీ ఈ ఎల‌క్ట్రిక్ సైకిల్ ను రూపొందించింది.

దీంట్లో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. 8.7ఏహెచ్ లైట్ వెయిట్ బ్యాట‌రీని ఇందులో ఉప‌యోగించారు. అయితే.. దీన్ని ఎక్క‌డికో తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి అమ‌ర్చిన సాకెట్ ద్వారా ఇంట్లోనే సెల్ ఫోన మాదిరిగా ఛార్జ్ చేసుకోవ‌చ్చు.

ఇందులో రెండు మోడ్ లు ఉంటా‌యి. రోడ్ లార్క్ పెడల్ మోడ్ లో పెట్టుకుంటే 100 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించొచ్చు. థ్రొట్టిల్ మోడ్ ను యూజ్ చేస్తే 75 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్లొచ్చు. గంట‌కు 25 కిలోమీట‌ర్ల వేగంతో ఈ సైకిల్ ప‌రిగెడుతుంది. ఇక‌, ఈ సైకిల్ ప్ర‌యాణానికి త‌గ్గ‌ట్టుగానే.. బ‌లంగా త‌యారు చేశారు. సాలిడ్‌ స్టీల్ ను ఉపయోగించారు.

దీన్ని కొనుగోలు చేయాలంటే.. సంస్థ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి ఆర్డ‌ర్ చేయొచ్చు. ప్ర‌స్తుతం ఈ సైకిల్ ధ‌ర రూ.42 వేలుగా నిర్ణ‌యించారు. ఒక‌సారి కొనుగోలు చేస్తే పెట్రోల్ ఖ‌ర్చులు కూడా లేవుకాబ‌ట్టి.. జ‌నం ఈ సైకిల్ వైపు చూసే అవకాశం ఉంద‌ని అంటున్నారు మార్కెట్ నిపుణులు.