Begin typing your search above and press return to search.

ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థినీ.. తృటితో తప్పిన ప్రాణాపాయం..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 8:30 AM GMT
ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థినీ.. తృటితో తప్పిన ప్రాణాపాయం..!
X
అత్యంత సురక్షితమైన ప్రయాణాల్లో ట్రైన్ జర్నీ ఒకటి. అయితే ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ముందుగా ఎవరూ చెప్పలేరు. అయితే ట్రైన్ దిగే అప్రమత్తం లేకుంటే మాత్రం పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

రైల్లో రద్దీ వల్ల ఇటీవల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రైన్ ఎక్కే సమయంలో.. దిగే సమయంలో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతుండటం మనం తరుచూ చూస్తే ఉంటాం. రైల్వే స్టేషన్లో జనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రైన్ ఎక్కడం.. దిగడం అనేది సాహసమే చెప్పాలి. పండుగ రోజుల్లో ఇలాంటివి తరుచూ కన్పిస్తుంటాయి.

అయితే రైలు ప్లాట్ ఫామ్ కు చేరుకునే సమయంలో కొందరు హడావుడిగా దిగుతూ ఉంటారు. రైలు ఆగక ముందే ప్రయాణికులు ట్రైన్లోకి ఎక్కడం.. దిగడం వంటివి చేస్తూ తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ప్యాసింజర్ రైలు దిగుతున్న క్రమంలో రైల్వే ప్లాట్ ఫాం.. రైల్ కు మధ్యలో ఇరుక్కుపోయిన నానా యాతన అనుభవించింది.

చివరకు రైల్వే పోలీసులు రిస్క్కూ ఆపరేషన్ నిర్వహించి ఆ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మన ఏపీలోని విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ బుధవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న శశికళ(20) అనే విద్యార్థినీ కళశాలకు వెళుతూ అన్నవరం నుంచి దువ్వాడకు చేరుకుంది.

గుంటూరు-రాయగడ ఎక్స్ లో బయలుదేరిన శశికళ దువ్వాడ రైల్వే స్టేషన్ కు రాగానే దిగేందుకు యత్నించింది. ఈక్రమంలోనే రైలు ప్లాట్ ఫామ్.. రైలు మధ్యలో ఉన్న గ్యాప్ లో జారిపడింది. ఈక్రమంలోనే ఆమె కాలు మెలి తిరిగి ట్రాక్ లో ఇరుక్కుపోయింది. విద్యార్థిని బాధతో కేకలు వేయడంతో రైల్వే అధికారులు రైలు డ్రైవర్ ను ప్రయాణం కొనసాగించవద్దని ఆదేశించారు.

ఆ వెంటనే రైల్వే పొటెక్షన్ ఫోర్స్ అక్కడి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థిని బయటికి లాగేందుకు ఫ్లాట్ ఫామ్ లోని కొంత భాగాన్ని కట్ చేశారు. విద్యార్థిని బయటికి తీసి ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థినీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గంటన్నర పాటు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఈ మార్గంలోని ఇతర రైళ్ల రాకపోకలను దారి మళ్లీంచారు.