ఒక పాదయాత్ర.. మరికొన్ని మతలబులు.. ఎందుకీ రగడ..!

Wed Jan 25 2023 10:11:14 GMT+0530 (India Standard Time)

A Padayatra.. and some other religions

రాష్ట్రంలో అనేక మంది పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు అనేక మంది పాద యాత్రలు చేయడం..ప్రజలు వారిని ఆశీర్వదించడం.. అధికారం అప్పగించడం కూడా తెలిసిందే. వైఎస్ నుంచి జగన్ దాకా.. ఏపీకి పాదయాత్రలు కొత్తకాదు. వాటిపై ఎప్పుడూ చర్చలు కూడా జరగలేదు. వివాదాలు అంతకన్నా లేదు. ఇటీవల తెలంగాణలో బీజేపీ నాయకుడు.. బండి సంజయ్ కానీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కానీ.. పాదయాత్రలు చేశారు.అయితే.. వారి పాదయాత్రలపై అక్కడ కూడా అబ్యంతరాలు ఎవరికీరాలేదు. అయితే.. ఎటొచ్చీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయ డం..రెచ్చగొట్టే ధోరణిలో విమర్శలు చేయడమే అప్పట్లో చర్చకు వచ్చాయి. వివాదాలు అయ్యాయి.

అయితే.. ఇప్పుడు మాత్రం టీడీపీ యువ నాయకుడు పార్టీ మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపై కూడా ఇదే చర్చసాగుతోంది. పాదయాత్ర చేయడానికి లేదా.. నారా లోకేష్‌కు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం అనుకూలంగానే ఉందని ప్రకటిస్తున్నారు.అయితే.. అనుమతుల విషయంలోనే కొన్ని షరతులు తెరమీదికి వచ్చాయి.

రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది. నిజానికి పాదయాత్ర ద్వారా పార్టీని పుంజుకునేలా చేయడం వెను క.. ఖచ్చితంగా ఈ వ్యూహం ఉంది. ఉంటుంది కూడా!ఏ పాదయాత్రా.. చప్పగా సాగదు.

గతంలో సీఎం జగన్ చేసిన పాదయాత్ర లోనూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా? అనేది ప్రశ్న. అంతేకాదు.. ఆయన సమస్యాత్మక విషయాలపైనా స్పందించారు. మొత్తంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసే పాదయాత్రలు ఏవైనా కూడా ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే కీలక అజెండా తోనే సాగుతాయి.

ఇన్ని విషయాలు తెలిసి కూడా వైసీపీ ఇలా నిబంధనల కొరడా ఝళిపించడం వెనుక.. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఈ పాదయాత్ర పెంచుతుందనే భయం.. లేదా బెరుకు.. ఉండి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర లకు అనుమతి అవసరంలేకపోయినా..రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. తద్వారా జరుగుతున్న వివాదాలు.. వంటి కారణంగానే ఇలా అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న భారత్ జోడో యాత్రకు రాహుల్ అనుమతి కోరలేదు. కేవలం పోలీసుల నుంచి ట్రాఫిక్ సమస్యలు సహా.. ఇతర అంశాలపై మాత్రమే అనుమతి తీసుకున్నారు. సో.. ఎలా చూసుకున్నా వివాదాలకు అవకాశం ఇవ్వకుండానే ఇరు పక్షాలకు మంచిది అంటున్నారుపరిశీలకులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.