Begin typing your search above and press return to search.

గోవాలో డ్రగ్స్ ఇంత ఈజీగా దొరకుతుందా?

By:  Tupaki Desk   |   17 Oct 2020 7:10 AM GMT
గోవాలో డ్రగ్స్ ఇంత ఈజీగా దొరకుతుందా?
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ మరణం బాలీవుడ్ ను షేక్ చేసింది. ఇతడి మరణానికి డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఎన్సీబీ లోతుగా దర్యాప్తు చేయగా... దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా వెలుగుచూస్తోంది. కొత్త కొత్ల లింకులు బయటపడుతున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ లో టాలీవుడ్ తో ఉన్న డ్రగ్స్ లింకులపై విచారణ జరిగింది.. కానీ పెద్ద తలకాయలు బయటపడలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు ఇప్పుడు సైడ్ అయిపోయిందన్న టాక్ ఉంది.

దేశంలో డ్రగ్స్ దందాకు మూలాలు ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో ఉన్నట్టు ఎన్సీబీ విచారణలో తేలినట్టు సమాచారం. గోవాకు పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇక ఇక్కడికి వచ్చే దేశీయ టూరిస్టుల్లో 75శాతం మంది తెలుగు వాళ్లు కావడం గమనార్హం. అందులోనూ హైదరాబాదీలే ఎక్కువని తేలిందట.. కేవలం రెండే రెండు గంటల్లో గోవాలో డ్రగ్స్ దొరుకుతాయని తేలింది. అంతేకాదు.. రాష్ట్రాలు దాటించినా చెక్ పోస్టుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదని నిరూపితమైంది. 4 రాష్ట్రాలు 19 చెక్‌పోస్టులు దాటి డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకువచ్చినా ఎవరూ పట్టుకోని పరిస్థితి నెలకొంది.

గోవాలో పక్కా సోర్స్ ఉంటేనే డ్రగ్స్ కు రూట్ దొరుకుతుందని ఓ మీడియా చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో కూడా బయటపడింది. కామన్ మ్యాన్ గా రంగంలోకి దిగిన ఓ టీవీ చానెల్ ప్రతినిధులకు కేవలం రెండు గంటల్లోనే గోవాలో డ్రగ్స్ దొరకడం సంచలనమైంది. ఒక బైక్ పై బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చిన ఒక లేడి ఆ మీడియా ప్రతినిధులకు ఖరీదైన డ్రగ్స్ ను డబ్బు తీసుకొని ఇచ్చింది. ఇదంతా వీడియోల్లో రికార్డ్ కావడంతో ఇప్పుడు సంచలనమైంది.

గోవాలో ఆన్ లైన్ లో చాట్ తర్వాతే.. పక్కా సోర్స్ ఉంటేనే డ్రగ్స్ ఇస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారికి డ్రగ్స్ ఇవ్వరు. ఇదంతా పకడ్బందీగా పక్కా వ్యూహంతో సాగుతుంటుందని ఓ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.