పక్కింటి 9వ తరగతి పిల్లోడు.. ఆ ఎంబీబీఎస్ యువతిని ఇలా చేశాడు!

Thu Apr 08 2021 10:00:01 GMT+0530 (IST)

9th Class Boy Gave Huge Shock To His Neibhour Girl

ఫోన్ ఇంటర్నెట్ వచ్చాక పిల్లలు సైతం చెడిపోతున్నారు. ఆ మాయాలోకంలో చెడు బాట పడుతున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న యువతికి తాజాగా 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఝలక్ ఇచ్చి ఆమె మానం మర్యాద తీసిన వైనం విస్తుగొలుపుతోంది.హైదరాబాద్ లోని ఒక కాలనీలో ఇద్దరూ పక్కపక్కన ఉండేవారు ఓ ఎంబీబీఎస్ యువతి 9వ తరగతి పిల్లోడు.  తమ్ముడి వయసున్న వాడని పక్కింటి పిల్లోడికి తన ఫోన్ ను ఎంబీబీఎస్ యువతి ఇచ్చింది.

ఒకరోజు ఆ 9వ తరగతి పిల్లోడు యువతి ఫోన్ లో మెయిల్ ఐడీ పాస్ వర్డ్ ను మార్చేశాడు. అప్పటి నుంచి ఆమె పేరుతో ఆన్ లైన్ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం చేశాడు. ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు.

ఈ విషయం చూసి తన మెయిల్ ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకుంది. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి రోజూ అలాంటి పనులే చేశాడు ఆ బాలుడు. ఆ వేదన భరించలేక తాజాగా యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆ బాలుడి గుట్టురట్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఇతరు ఫోన్లు తీసుకొని పాస్ వర్డ్ లు మార్చి సిస్టంలో అసభ్య ఫొటోలు పెట్టడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనైల్ హోంకు తరలించారు. పక్కింటి బాలుడే ఇలా చేశాడని తెలిసి యువతి ఖంగుతిన్నది.