Begin typing your search above and press return to search.

విశాఖలో రూ.8 కోట్లు కొట్టేసిన ముఠా

By:  Tupaki Desk   |   22 Nov 2020 3:30 PM GMT
విశాఖలో రూ.8 కోట్లు కొట్టేసిన ముఠా
X
జీఎస్టీ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఎటువంటి వ్యాపారం చేయకుండా నకిలీ బిల్లుతో కోట్లు కొట్టేసిన ముఠాను అధికారులు పట్టుకున్నారు. తాజాగా నిర్వహించిన సోదాల్లో ఈ మేరకు పలు వాస్తవాలు బయటపడ్డాయి.

గోల్డ్ బులియన్ మార్కెట్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ జీఎస్టీ బృందం శనివారం ఈ ముఠా గుట్టును రట్టు చేసింది. వ్యాపారం చేయకుండానే కొందరు అక్రమార్కులు ఈ నకిలీ బిల్లులతో రూ.28 కోట్ల రాయితీ పొందినట్టు గుర్తించారు.

మొత్తం 32 బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి రూ.400 కోట్ల వ్యాపారం చేసినట్టు నకిలీ బిల్లులు సృష్టించారు. గుంటూరు, మంగళగిరి పరిసరాల్లోని వివిధ సంస్థల్లో జీఎస్టీ బృందం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.1.58 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సూత్రధారిని అరెస్ట్ చేశారు.

32 బోగస్ సంస్థలను సృష్టించి నిధితులు కాజేసినట్టు కనుగొన్నారు. వీరిపై ఏడు కేసులు నమోదయ్యాయని తెలిసింది. ఈ కేసులో గుంటూరుకు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.