68 రోజుల హనీమూన్ ...అసలు విషయం ఇదే !

Mon May 25 2020 13:30:16 GMT+0530 (IST)

68 Days Honeymoon ...

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. కొత్తగా పెళ్ళైన ఓ జంట .. మధురానుభూతులను పంచుకుందామని హనీమూన్ ప్లాన్ చేసకున్నారు. మలేషియాకు వెళ్లేందుకు రాను పోను టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే వారం రోజులు హనీమూన్ ప్లాన్ చేసుకోగా ...అది కాస్త 68 రోజులు అయ్యింది. ఈ సంఘటన రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది.పూర్తి వివరాలు చూస్తే ..నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్ అతడి భార్య పల్లవి మిశ్రాలు పెళ్లి తరువాత గత మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ.. ఇండియాకు వచ్చేందుకు రెడీ కాగానే.. కరోనా దెబ్బ పడింది. విమానాలన్నీ రద్దయ్యాయి.  తే మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే విమానాలు రద్దయ్యాయి. దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడే వారికి వసతి ఏర్పాట్లు చేసింది. చివరికి వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈ నవ దంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం నాడు భువనేశ్వర్ చేరుకున్నారు.దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు