Begin typing your search above and press return to search.

ఢిల్లీ మసీదుల్లో 600 మంది దాక్కోవటమా? ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   4 April 2020 5:00 AM GMT
ఢిల్లీ మసీదుల్లో 600 మంది దాక్కోవటమా? ఏం జరుగుతోంది?
X
ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకుల్లో పలువురికి కరోనా పాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే.. తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు.. ఆ వెంటనే తెర వెనుక కదిపిన పావులతో పెద్ద ఉపద్రవం కాస్తలో మిస్ అయిన పరిస్థితి. ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులకు కరోనా పాజిటివ్ అన్న వెంటనే.. వారు ఎవరెవరిని కాంటాక్టు అయ్యారో తేల్చటమే కాదు.. వారెక్కడెక్కడ తిరిగారు? ఎవరిని కలిశారు? లాంటివి యుద్ధ ప్రాతిపదికన గుర్తించటమే కాదు.. వారందరిని జల్లెడ వేసి.. అనుమానం ఉన్న వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి.. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక నజర్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో బయటకు వచ్చిన వార్తల కంటే కూడా తెర వెనుక జరిగిందే ఎక్కువని చెప్పక తప్పదు.

తమకు ఎదురైన అనుభవాన్నికేంద్రానికి చెప్పి.. మీరు వెంటనే అలెర్ట్ కావాలని హెచ్చరిస్తే కానీ.. అటు కేంద్రం కానీ.. ఇటు ఢిల్లీ రాష్ట్ర సర్కారులో కానీ చలనం రాని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? శుక్రవారానికి కూడా మర్కజ్ కు హాజరైన విదేశీయుల్ని గుర్తించే విషయంలో కేంద్రం.. ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఇప్పటికి కిందామీదా పడటం చూస్తే షాక్ కు గురి కాక మానదు.

మర్కజ్ కోసం వచ్చిన పలువురు విదేశీయులు ఢిల్లీలోని పలు మసీదుల్లో మకాం వేసి.. బయటకు రాకుండా ఉంటున్న వైనంపై చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్లుగా చెప్పాలి. ఇప్పటివరకూ వేసుకున్న అంచనాల ప్రకారం ఇంకా 600 మంది ఢిల్లీలోని వివిధ మసీదుల్లో మకాం వేసినట్లుగా గుర్తించారు. వారి జాడను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ కార్యకర్తలు.. పౌర సేవకులు.. పోలీసులతో కలిసి ఢిల్లీలోని మసీదుల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్న వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంత నిదానంగా ఎందుకు ఉంది? నిజానికి పోలీసులు అడగటానికి ముందే.. ప్రభుత్వమే మసీదులు మొత్తాన్ని తనిఖీ చేయించి ఉంటే బాగుండేది కదా? మర్కజ్ కు వెళ్లి వచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని.. అదే సమయంలో ఆంధ్రాలోని వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి.. వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నప్పుడు.. ఢిల్లీ సర్కారు ఎందుకలా చేయటం లేదన్నది ప్రశ్న.

వాస్తవానికి స్వదేశీయుల్ని గుర్తించటంతో పోలిస్తే.. విదేశీయుల్ని గుర్తించటం చాలా సులువన్నది మర్చిపోకూడదు. కానీ.. ఆ విషయంలోనూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పటికి వెతుకులాటలోనే ఉంటే.. వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకొని పరీక్షలు జరిపి.. ఫలితాలు తేల్చేసరికి వారెంతమందిని కాంటాక్టు అవుతారో? దాని తీవ్రత మరెంత ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనే ఒళ్లు జలదరించేలా చేస్తుందని చెప్పక తప్పదు.