Begin typing your search above and press return to search.

మార్చికి ఇండియా లో 6 కోట్ల కరోనా కేసులు

By:  Tupaki Desk   |   16 July 2020 12:10 PM GMT
మార్చికి ఇండియా లో 6 కోట్ల కరోనా కేసులు
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.36 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదున్నర లక్షల మందికి పైగా చనిపోయారు. మన దేశం విషయానికి వస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకి సమీపిస్తోంది. ప్రతి రోజు 25వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా పరీక్షలు పెంచేకొద్దీ కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ... వచ్చే ఏడాది మార్చి సమయానికి దేశమో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ఓ రిపోర్ట్‌ ను తాజాగా తయారుచేసింది.

2021 మార్చికి భారతదేశంలో తక్కువలో తక్కువగా 37.4 లక్షలు ఉండొచ్చని, వైరస్ ప్రభావం విపరీతంగా ఉంటే ఎక్కువలో ఎక్కువగా 6.18 కోట్ల కేసులు నమోదు కావొచ్చు అని ఐఐఎస్‌ సీ అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల డేటా, ట్రెండ్స్‌ ను పరిశీలించి ఐఐఎస్‌ సీ దీన్ని తయారు చేసింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి చూస్తే ఈ లెక్కలు కాస్త పెరగొచ్చు కూడా. అయితే, ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది అని, ఈ వైరస్ వ్యాప్తి తగ్గిపోవాలి అంటే వారంలో రెండు రోజులు లాక్‌ డౌన్ విధించాలని ఐఐఎస్ ‌సీ తెలిపింది. ఈ కరోనా వైరస్ కి సరైన వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని తెలిపింది.