Begin typing your search above and press return to search.

సూర్యాపేట‌లో నాలుగు నెలల శిశువుకి పాజిటివ్‌ !

By:  Tupaki Desk   |   27 May 2020 5:00 AM GMT
సూర్యాపేట‌లో నాలుగు నెలల శిశువుకి పాజిటివ్‌ !
X
తెలంగాణ లో మళ్లీ ఒక్కసారిగా అలజడి మొదలైంది. గత కొన్ని రోజులుగా కేవలం జీహెచ్ ఎం సీ కే పరిమితమైన కరోనా మళ్లీ జిల్లాల్లో పంజా విసురుతోంది. మంగళవారం 71 కేసులు నమోదు కాగా.. జీహెచ్ ఎం సీలో 38, రంగారెడ్డి జిల్లాలో ఏడు, మేడ్చల్‌‌ లో ఆరు, ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1991కు చేరింది.

అయితే, ఎలా సోకిందో తెలియడం లేదు కానీ ,నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌ మండలంలోని జక్లేర్‌లో నాలుగు నెలల బాలుడికి వైరస్ పాజిటివ్‌ అని తేలింది. దీనితో వెంటనే వైద్యులు అక్కడికి చేరుకొని.. కాలనీ నుంచి రాకపోకలను నిలపివేశారు. సూర్యాపేట సమీపంలో కాసరబాద గ్రామానికి చెందిన చిన్నారికి వైరస్ పాజిటివ్ అని తేలింది. వారు ఉంటోన్న కాలనీని అధికారులు బ్లాక్ చేశారు. చిన్నారి పేరంట్స్, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేస్తున్నారు. ఆ చిన్నారి తల్లి ఆత్మకూరు మండలం ఏఫూర్‌ కు 4 నెలల క్రితం వెళ్లింది. అక్కడే డెలివరీ కాగా.. మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులతో ఆమె అత్తగారింటికి వచ్చింది. ఈ తరుణంలోనే గత 15 రోజుల పిల్లవాడికి జ్వరం వస్తుంది. స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నీలోఫర్ లో బాబుకు జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్ పరీక్ష చేశారు. అయితే అతనికి పాజిటివ్ ఉంది అని మంగళవారం రిపోర్ట్ వచ్చింది. దీనితో వెంటనే కాసరబాద చేరుకొని. కాలనీని బ్లాక్ చేశారు. రాకపోకలను నిలిపి వేశారు. అలాగే తల్లిగారు ఊరు ఏపూర్ వద్ద కూడా కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయబోతున్నారు.