Begin typing your search above and press return to search.

50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకే: జగన్ సంచలనం

By:  Tupaki Desk   |   14 Sep 2021 2:35 PM GMT
50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకే: జగన్ సంచలనం
X
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వైద్య, ఆరోగ్యశాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య శాఖ ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాలన్నారు. ఆరోగ్యబీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్ ల్యాబ్స్ లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.

అదేవిధంగా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్యసేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్ లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.

రోగులకు సరిపడా వైద్యులు, నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సేవలు అందుతాయన్నారు. అత్యుత్తమ నిర్వహణ పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలన్న సీఎం.. ఎవరూ ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయని పేర్కొన్నారు.అత్యుత్తమ నిర్వహణ పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలని.. ఎవరూ ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుతవ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సూచించారు.