Begin typing your search above and press return to search.

బ్రెజిల్​ లో ఘోర విమానప్రమాదం.. నలుగురు ఫుట్ ​బాల్​ ప్లేయర్స్​ మృతి..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 9:00 AM GMT
బ్రెజిల్​ లో ఘోర విమానప్రమాదం.. నలుగురు ఫుట్ ​బాల్​ ప్లేయర్స్​ మృతి..!
X
బ్రెజిల్​లో ఘోర విమానప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఫైలట్​ సహా ఐదుగురు ఫుట్​బాల్​ ప్లేయర్స్​ ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్​లో విషాదం నెలకొన్నది. మరికాసేపట్లో విమానం టే కాఫ్​ అవుతుందన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.

బ్రెజిల్​ దక్షిణాది రాష్ట్రం టోకొన్టిన్​లో ఈ ఘటన చోటుచేసుకున్నది. విలానోవా జట్టుతో గేమ్ ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. లుకాస్ మెయిరా , లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి అనే క్రీడాకారులు మృతిచెందినట్టు ఆ దేశ ఫుట్​బాల్​ యాజమన్యం తెలిపింది. అయితే ఈ ఘటనపై విచారణ సాగుతున్నది.

వీరంతా పామాస్ ఫుట్ బాల్ క్లబ్ కి చెందిన వారని సమాచారం. ఈ ఫుట్​బాల్​ క్లబ్​ను 1997 లో స్థాపించారు. అయితే ఈ విమానప్రమాదం పట్ల బ్రెజిల్​కు చెందిన పలువురు సంతాపం తెలిపారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణం ఉందా అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.