ఇండిపెండెన్స్ డే పరేడ్ కోసం 350మంది పోలీసుల క్వారంటైన్!

Sun Aug 09 2020 20:30:50 GMT+0530 (IST)

350 police officers in quarantine to make up August 15 guard of honour

దేశంలో కరోనా కల్లోలంగా మారింది. రోజుకు 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఢిల్లీలో అయితే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే పోలీసులకు కరోనా భయం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలోనే ఈనెల 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పరేడ్ లో పాల్గొనే 350మంది పోలీసులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్ లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఢిల్లీ కంటోన్ మెంట్ లోని పోలీస్ క్వార్టర్స్ లో వారిని భద్రంగా ఉంచినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

భారత స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరుపనున్నారు. దీంతో ఈ వేడుకలకు కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.