Begin typing your search above and press return to search.

తిరుగుబాటుదారుల ఘర్షణలో 30 మంది సైనికులు మృతి !

By:  Tupaki Desk   |   13 Oct 2021 3:30 PM GMT
తిరుగుబాటుదారుల ఘర్షణలో 30 మంది సైనికులు మృతి !
X
మయన్మార్ ‎లో దారుణం జరిగింది. సాగింగ్ ప్రాంతం లో మయన్మార్ మిలిటరీ, తిరుగుబాటు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మంది సైనికులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో జుంటా సైనికులు ‘క్లియరింగ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం “పాలే టౌన్‌షిప్  వెలుపల సైనిక కాన్వాయ్ కి ల్యాండ్‌మైన్‌ పేలడంతో 30 మంది సైనికులు మరణించారని అక్కడి స్థానిక మీడియా తెలిపింది.

సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లెయింగ్ నేతృత్వంలోని మయన్మార్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న జరిగిన తిరుగుబాటుతో మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. ఈ తిరుగుబాటుతో ఆ దేశంలో భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల నుంచి మయన్మార్‌లోని సైనిక బలగాలు 1,167 మంది పౌరులను చంపారు. దాదాపు 7,219 మందిని అరెస్టు చేశారు.

మయన్మార్ మిలిటరీ తిరుగుబాటు గ్రూపుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే 132 ఘర్షణలు జరిగినట్లు తెలిసింది.గత ఆగస్టులో మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌ యంగ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ తనకు తాను దేశ ప్రధానినని ప్రకటించుకున్నారు. దేశ ప్రధానిగా ఆగస్టు 1న హ్లయింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. 2023లో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.