Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ :తెలంగాణలో ఈ రోజు ఒకేసారి 25 వేలమంది రిలీజ్!

By:  Tupaki Desk   |   9 April 2020 7:50 AM GMT
బిగ్ బ్రేకింగ్ :తెలంగాణలో ఈ రోజు ఒకేసారి 25 వేలమంది రిలీజ్!
X
కరోనా వైరస్ ...ఈ మహమ్మారి ఈ దేశం ..ఆ దేశం తేడా లేకుండా ప్రపంచంలోని ప్రతి దేశానికీ విస్తరించింది. అలాగే సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు ఈ కరోనా భారిన పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా కరోనా రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణ లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు ఊహించని స్థాయిలో బయటపడ్డాయి. అయితే, కరోనా భాదితుల సంఖ్య పెరిగే కొద్ది తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఎప్పటికప్పుడు తన ప్రణాళికలు మార్చుతూ కరోనా ను రాష్ట్రంలో అరికట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ నేపథ్యం లో సీఎం తీసుకునే నిర్ణయాలు .. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆదర్శంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. దీనితో దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడే నాయకత్వ లక్షణాలు బయట పడతాయి అన్నట్టుగా ..సీఎం కేసీఆర్ ఆ సమస్యకి తగినట్టు వెంటనే స్పందిస్తూ ..అధికారులని అప్రమత్తం చేస్తున్నారు.

ఇకపోతే, తెలంగాణలో ఈరోజు ఒకేసారి 25వేల మంది సెల్ఫ్ క్వారంటైన్ నుంచి ప్రభుత్వం వారిని రిలీజ్ చేయబోతుంది. వీరందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారే. కరోనా భయాలతో ఈనెల 7న వీరిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 2 వారాల పాటు వీళ్లను స్వీయ నిర్భధంలో ఉంచారు. ఆ గడువు మంగళవారం తో పూర్తీ అయినప్పటికీ , మరో 2 రోజులు అదనంగా వీళ్లను ఇళ్లకే పరిమితం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ రోజుతో వాళ్లను రిలీజ్ చేయబోతోంది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వాళ్లనే కాకుండా, వాళ్లను కలిసిన వ్యక్తుల్ని కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు.

ఈరోజు వీరి ఇళ్లకు అతికించిన కరోనా అలెర్ట్ స్టిక్కర్ల ను తొలగించనున్నారు. అలాగే ఈ రోజు నుండి వీరి ఇళ్లపై పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా తొలగించనున్నారు. వీరందరికి ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు, శానిటైజర్లు కూడా అందించబోతున్నారు. తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453గా ఉంది. ఇప్పటివరకు 11 మంది మరణించగా.. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు.