రసిక మహాశయ.. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు.. వీడి ఎంజాయ్ మామూలు లేదే!

Sat Oct 01 2022 13:23:50 GMT+0530 (India Standard Time)

24 marriages at the age of 28 It's not normal to enjoy it!

ఈ కాలంలో అబ్బాయిలకు ఒక పెళ్లి కావడానికే నానా సంక నాకుతున్నారు. అమ్మాయిలకు ఫుల్ డిమాండ్ ఉంది. అబ్బాయి కాంప్రమైజ్ కావడం తప్పితే అమ్మాయిలు అయితే అస్సలు కావడం లేదు. బ్రహ్మాణ వైశ్య వెలమ లాంటి కులాల్లో ఇప్పటికే కన్యాశుల్యం మొదలైంది. డబ్బులిచ్చి ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఒక పెళ్లి చేసుకోవడానికే నానా తంటాలు పడుతున్న ఈసమయంలో వీడెవడండి బాబు ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒక భార్యను మెయింటేన్ చేయడానికే కిందా మీద పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 23 మంది భార్యలను చేసుకొని మరీ భద్రంగా ఉన్నాడు. 24వ భార్యకు డౌట్ రావడంతో వీడి ఆటకట్టైంది.మంచి ఉద్యోగం.. లక్షల్లో జీతం.. వెనుకాల గట్టి ఆస్తులున్న వారికి మాత్రమే అమ్మాయిని ఇస్తున్నారు. ఇవేవీ లేనివారికి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది ఈరోజుల్లో.. అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు తెగ డిమాండ్ఉంది. యువకులకు పెళ్లిళ్లు కావడం ఇప్పుడు పెద్ద టాస్క్ లా మారింది. ఇలా ఆపోసోపాలు పడుతున్న యువకులు ఓవైపు ఉంటే.. మరోవైపు ఒకడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదే ఆశ్చర్యం కలుగుతోంది.

28ఏళ్లకే ఈ కేటుగాడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకోవడమే అందరినీ షాక్ కు గురిచేస్తున్న అంశం. పశ్చిమ బెంగాల్ కు చెందిన అసబుల్ మొల్లా (28) పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. మూడు పదులు రాకముందే ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. బీహార్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి  యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.

ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు.. ఏకంగా 24 మంది యువతులను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. నకిలీ గుర్తింపులు సృష్టించి ఊరు పేరు మార్చుకుంటూ యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. వారి నుంచి డబ్బు నగలు తీసుకొని పరారయ్యాడు.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ఇలానే వివాహం చేసుకున్నాడు. గతంలో యువతులను మోసం చేసినట్టే ఈమె నుంచి డబ్బు నగలు తీసుకొని పరారయ్యాడు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన సదురు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు.

ఎట్టకేలకు ఇతగాడు చిక్కాడు. పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేలింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఒక పెళ్లికే దిక్కులేదంటే.. 24 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావ్ రా. ఏంట్రా ఇదీ స్వామీ' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాడికి కఠినమైన శిక్ష విధించాలని.. మరోసారి పెళ్లి అంటేనే భయపడేలా చేయాలని వధువులు కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.