పీవీ సింధూ అకాడీమీకి ఉచితంగా 2 ఎకరాలు

Thu Jun 17 2021 21:14:13 GMT+0530 (IST)

2 acres free to Pv Sindhu Academy

బ్యాడ్మింటన్ స్టార్ తెలుగుతేజం పీవీ సింధుకూ ఏపీ ప్రభుత్వం  2 ఎకరాల భూమి కేటాయించింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. ఈ భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.విశాఖ రూరల్ చినగదిలి గ్రామంలో రెండు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింధూకు కేటాయించిన భూమి పశుసంవర్ధకశాఖకు చెందింది. ఆ శాఖ నుంచి యువజన సర్వీసులు క్రీడలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఈ కేటాయింపు చేసింది.

ఈ 2 ఎకరాల స్థలంలో పీవీ సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో వెలువరించింది. అకాడమీని రెండు ఫేజుల్లో నిర్మించనున్నట్టు ప్రభుత్వానికి పీవీ సింధూ తెలిపింది. ఒక్కో దశలో రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది.

ఇక అకాడమీ అవసరాల కోసమే ఆ భూమి ఉపయోగించాలని.. వాణిజ్య అవసరాల కోసం వాడకూడదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అకాడమీ ద్వారా ప్రతిభ ఉన్న పేదవారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.