Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు!

By:  Tupaki Desk   |   2 April 2020 1:30 PM GMT
బ్రేకింగ్ : లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు!
X
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుండటంతో లాక్‌ డౌన్‌ ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. కరోనాకి మందు లేకపోవడంతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ..సామజిక దూరం ఒక్కటే మార్గం అని భావించి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమల్లోకి తెస్తుంది. అయితే, కరోనా మహమ్మారి సోకుతుంది అని తెలిసినప్పటికీ కూడా కొందరు లాక్ డౌన్ నియమాలని అతిక్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నియమాలని తుంగలో తొక్కేవారికి కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు. ప్రాణాంతక వైరస్‌ విస్తృతంగా ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. లాక్‌ డౌన్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వచ్చే వారికి చెక్‌ పెట్టాలని కోరారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే పూర్తి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2032కు చేరగా వీరిలో 150 మంది కోలుకోగా 50 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మిలియన్‌కు చేరువలో ఉండగా.. దాదాపు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు