Begin typing your search above and press return to search.

టీడీపీలో 1983....హాట్ టాపిక్ అదే... ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 1:30 PM GMT
టీడీపీలో 1983....హాట్ టాపిక్ అదే... ?
X
సీనియర్ అంటే రాజకీయాల్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత ముదిరితే అంత గొప్ప లీడర్ అని అక్కడ లెక్క ఉంది. ఎంత బాగా ఎదిగితే అన్ని లోతులు చూశారు అనుకుంటారు. అందుకే సీనియర్ సేవలను ఏ పార్టీ అయినా బాగా వాడుకుంటుంది. వారి మద్దతు, మంత్రాంగం అన్నీ కూడా పార్టీకి ఎపుడూ శ్రీరామ రక్షగా ఉంటాయి. అయితే ఎక్కువ తీపి అయితే చేదుగానే ఉంటుంది. అలాగే సీనియారిటీ మరీ ఎక్కువైతే ఓల్డేజ్ షేప్ వచ్చేస్తుంది. టీడీపీ ప్రస్తుతం ఆ భారం మోయలేకనే నానా అవస్థలు పడుతోంది.

ఎపుడో ఎన్టీయార్ పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చి చేరిన వారంతా ఇపుడు షష్టి పూర్తి బ్యాచ్ అయిపోయారు. ఆనాడు పాతికేళ్ల వయసున్న వారు, పదును తేరిన వారు ఇపుడు ఆరు పదులు దాటి రాజకీయ ప్రస్థానంలో అలసిపోతున్నారు. వారి ఆలోచనలు కూడా అవుట్ డేటెడ్ గా మారిపోతున్నాయి. ఒక్కొక్కరూ అయిదారు సార్లు గెలిచేసి తామున్న చోటనే జనాలకు బోరు కొట్టేస్తున్నారుట.

ఇక వారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే అది గతమైపోగా కొత్త నెత్తురు వచ్చి వెక్కిరిస్తోంది. ఇక వారు బాడీ లాంగ్వేజ్ నుంచి మాట్లాడే భాష లుక్ అంతా ఓల్డ్ ట్రెడిషన్ లో య‌స్టెర్ డేస్ ఫార్మేట్ లో సాగుతోంది. ఇపుడు వస్తున్న రాజకీయ నేతలతో వారు ఏ విధంగా పోటీ పడలేకపోతున్నారు. అదే టైమ్ లో జనాలతో కూడా కనెక్ట్ కావడం కష్టంగా మారుతోంది.

దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది. సీనియర్ల మీద మర్యాద ఉన్నా కూడా 2024 నాటి పాలిటిక్స్ 1983 బ్యాచ్ అసలు సెట్ కారని కచ్చితమైన అభిప్రాయానికి బాబు వచ్చేశారని టాక్. అందువల్ల మీ సేవలు ప్రత్యక్ష రాజకీయాలకు ఇక చాలు అని బాబు వారికి గట్టిగా చెప్పబోతున్నారుట.

మీరు పార్టీ నేతలుగా, పెద్దలుగా ఉంటూ సలహాలు ఇవ్వండి, అలాగే మీ ఏరియాల్లో మీ పలుకుబడిని ఉపయోగించి కొత్త నీరుకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి, అలా పార్టీని పటిష్టం చేస్తూ గెలిపించండి అని బాబు వారికి ఒక సందేశం ఇవ్వబోతున్నారుట. ఏపీవ్యాప్తంగా బాబు సేకరించిన సీనియర్ల జాబితా చూస్తే చాలా పెద్ద తలకాయలే వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్లు దక్కించుకోకపోవచ్చు అంటున్నారు.

ఇలా సీనియర్ల లిస్ట్ లో చేరిన వారు చూసుకుంటే కిమిడి కళా వెంకటరావు, ప్రతిభాభారతి, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామక్రిష్ణుడు, , కేయీ క్రిష్ణ మూర్తి, జేసీ బ్రదర్స్ వంటి వారు ఉన్నారని చెబుతున్నారు. మరి బాబు వీరికి కాకపోయినా వారి వారసులకు టికెట్లు ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అది కూడా లేకపోతే మాత్రం సీనియర్లు ఏం చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా బాబు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మాత్రం యువ రక్తానికి పనిచేసే వారికి చాన్స్ వస్తుందని తమ్ముళ్లు అంటున్నారు. మరి చూడాలి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో.