Begin typing your search above and press return to search.

చంద్రుడి మీద సెక్సు చేయాలనుకున్న అతడి కోరికతో నాసాకు ర.158కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:39 AM GMT
చంద్రుడి మీద సెక్సు చేయాలనుకున్న అతడి కోరికతో నాసాకు ర.158కోట్ల నష్టం
X
ఇప్పుడో వార్త ఇంటర్నెట్ లో తెగ హడావుడి చేస్తోంది. దాదాపు పందొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతం తాజాగా వెలుగు చూడటమే కాదు.. ఇలా కూడా జరిగిందా?అన్న ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. నాసాకు చెందిన ఒక వ్యోమగామి చేసిన పాడు పని వల్ల ఆ సంస్థకు రూ.158 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. విన్నంతనే ఉలిక్కిపడే ఈ ఉదంతంలో ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇంతకీ ఆ వ్యోమగామి ఎవరు? అతడేం చేశారు? చంద్రుడి మీద రొమాన్సు చేయాలన్న అతగాడు ఇప్పుడెక్కడ ఉన్నాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..

థాడ్ రాబర్ట్స్ అనే సైంటిస్టు అమెరికాకు చెందిన వారు. చంద్రమండలం మీద కాలు మోపి.. అక్కడ ప్రయోగాలు చేయాలన్నిఅతడి చిరకాల వాంఛ. కష్టపడి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అతడికి నాసా లూనార్ ల్యాబ్ లో ట్రైనింగ్ పొందే అవకాశం లభించింది. అక్కడ వ్యోమగామిగా శిక్షణ తీసుకోవాలే కానీ.. ఏదో ఒక రోజు అంతరిక్షంలోకి అడుగు పెట్టే అవకాశం కచ్ఛితంగా ఉంటుంది. అందుకే.. అతడు ఆ ట్రైనింగ్ పొందసాగాడు. అయితే.. ఇతడికున్న బలహీనతల్లో ముఖ్యమైనది సెక్స్. ఇతడికి ఆ కోరికలు ఎక్కువ.

నాసాలో శిక్షణ పొందుతున్న వేళలో.. తనతో పాటు ల్యాబ్ లో పని చేసే తన గాళ్ ఫ్రెండ్ తో కలిసి చంద్రుడి మీద సెక్సు చేయాలన్న విచిత్రమైన ఆలోచన చేశాడు. అందుకు నాసా ససేమిరా అంటుంది. అందుకే తన కోరికను తీర్చుకోవటానికి తెగ ఆలోచించిన అతడు.. చివరకు ఒక దరిద్రపుగొట్టు ఐడియా వేశాడు. అదేమంటే.. నాసా చంద్రమండలం నుంచి తెచ్చిన 101 గ్రాముల రాళ్లు.. ధూళిని తేవటంతో.. వాటిని దొంగలించి.. పరుపు మీద వాటిని పెట్టుకోవటం ద్వారా చేసే రొమాన్సు.. చంద్రమండలం మీద చేసినట్లే ఫీలయ్యాడు.

తన చెత్త ఆలోచనను గాళ్ ఫ్రెండ్ కు చెప్పటం ఆమె మరో ఆలోచన చేయకుండా ఓకే చెప్పేయటంతో.. కొంతమందితో కలిసి చంద్రమండలం నుంచి సేకరించిన ధూళిని దొంగతనం చేశాడు. తన కోరికనుతీర్చుకున్న తర్వాత.. గ్రాము చంద్రుడి ధూళిని రూ.3.7లక్షల చొప్పున అమ్మేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్టుతో ఒప్పందం చేసుకున్నాడు. తన ప్లాన్ లో భాగంగా నాసాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేసిన చంద్రుడిధూళిని విజయవంతంగా దోచేశాడు. తన దరిద్రపుగొట్టు కోరికను తీర్చుకోవటం కోసం ఒక హోటల్ లో రూం బుక్ చేసుకొని.. తన సెక్స్ కోరికను తన గాళ్ ఫ్రెండ్ తో తీర్చేసుకున్నాడు.

ఆపై తాను దొంగలించిన చంద్రుడి ధూళితో మరింత సంపాదించేందుకు.. తన దగ్గరున్న దాని బరువు పెంచేందుకు కల్తీలకు పాల్పడ్డాడు. ఒప్పందంలో భాగంగా తాను చోరీచేసిన చంద్రుడి ధూళిని తీసుకొని వచ్చిన వేళ.. ఎఫ్ బీ అధికారులు ఇతడి గుట్టురట్టు చేస్తూ.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న చంద్రుడి ధూళిని స్వాధీనం చేసుకున్నారు.కానీ.. దాన్ని కల్తీ చేయటం ద్వారా నాసాకు దాదాపు రూ157 కోట్లు విలువ చేసే ధూళిని నాసా పోగొట్టుకుంది. ఇంత భారీ నేరానికి పాల్పడిన థాడ్ కు అక్కడి న్యాయస్థానం ఎనిమిదేళ్లు జైలుశిక్ష విధించింది. అతి కోరికలతో రగిలిపోయిన అతగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.