Begin typing your search above and press return to search.

ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తున్న 1500 కార్లు వెనక్కి పంపేశారు!

By:  Tupaki Desk   |   13 Jun 2021 2:54 PM GMT
ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తున్న 1500 కార్లు వెనక్కి పంపేశారు!
X
ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తున్న కార్లకు మరోసారి షాక్ తగిలింది. కరోనా సెకండ్ వేవ్ వేళ.. ఆంధ్రా నుంచి వస్తున్న వాహనాలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న వేళ.. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సుల్ని అడ్డుకోవటం తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్సుల విషయంలో తీరు మార్చుకున్న అధికారులు.. మిగిలిన వాహనాల విషయంలో స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఏపీ నుంచి తెలంగాణలోకి రావాలంటే కచ్ఛితంగా ఈపాస్ ఉండాల్సిందే. ఈ విషయాన్ని ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. అయినప్పటికి పలువురు కార్ల యజమానులు ఈ-పాస్ లు లేకుండా తెలంగాణలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆదివారం ఉదయం నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున కార్లు వస్తున్నాయి. వాటిల్లో ఈ-పాస్ లు ఉన్న వారిని మాత్రమే రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నారు.

అయితే.. చాలామంది కార్ల యజమానులు ఈ-పాస్ లు లేకుండా వచ్చే ప్రయత్నం చేశారు. వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలో పగటిపూట లాక్ డౌన్ ఎత్తేశారని పేర్కొంటూ రామాపురం చెక్ పోస్టు వద్దకు పెద్ద ఎత్తున వాహనాలు చేరుకున్నాయి. ఉదయం లాక్ డౌన్ ఎత్తేసినప్పుడు తెలంగాణలోకి వస్తున్న కార్లను పోలీసులు ఆపి.. ఈపాస్ అడుగుతున్నారు. లేని వారిని వెనక్కి పంపుతున్నారు. ఈపాస్ లేని వాహనాల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పస్టం చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు 700 కార్లను తెలంగాణలోకి అనుమతించగా.. 1500 కార్లను మాత్రం వెనక్కి పంపారు. వీరంతా ఈపాస్ లేకుండా తెలంగాణలోకి వచ్చే ప్రయత్నం చేశారని అధికారులు పర్కొంటున్నారు.