ప్రకాశంలో దారుణం..నోట్లో గుడ్డలు కుక్కి బాలికపై అత్యాచారయత్నం

Sun May 31 2020 13:14:35 GMT+0530 (IST)

11 years Girl Rape in Prakasam District

కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లు వారి వయసు చూడకుండా అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలికలకు రక్షణ లేకుండాపోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోరంగా జరిగింది. 11 ఏళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు అత్యాచార యత్నం చేశాడు. పైగా అతడు తండ్రి వయసు ఉంటుంది.ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లి గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. బాలిక కుటుంబసభ్యులు ఎవరూ లేరు. ఈ విషయాన్ని గమనించిన 48 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో బాలిక అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు - అరుపులు వేసింది. దీంతో అతడు భయంతో ఆ ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి కుటుంబసభ్యులకు బాలిక తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఆ నిందితుడు బాధిత కుటుంబసభ్యులను బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపుతామని హెచ్చరించారు. దీంతో బాధితులు భయపడి జరిగిన ఘటనను దాచుకున్నారు. అయితే ఆ నోట ఈ నోట ఈ వార్త తెలిసి చివరకు బహిర్గతమైంది. అన్యాయాన్ని ధైర్యంగా ఎవరికి చెప్పలేని వారి పరిస్థితి కొందరు అండగా నిలిచారు. అయితే ఈ విషయమై రాజకీయ పెద్దలు బయటకు రాకుండా రాజీ చేసే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మాట వినకపోతే బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. అయితే ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

తండ్రి వయసు ఉన్న వ్యక్తి 11 ఏళ్ల బాలిక నోట్లో గుడ్డలు కుక్కి పాశవికంగా అత్యాచారం చేయడానికి యత్నించడం దారుణంగా మహిళ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ఈ ఘటనపై వారు ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.