Begin typing your search above and press return to search.

ప్రపంచానికి కరోనా వైరస్ అంటించి చైనా మాత్రం ఎంజాయ్ చేస్తోంది!

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 PM GMT
ప్రపంచానికి కరోనా వైరస్ అంటించి చైనా మాత్రం ఎంజాయ్ చేస్తోంది!
X
ప్రస్తుతం ప్రపంచంలో ఒకచోట పది మంది కలిసి కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. కలిసి తిరిగాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ఒకటి కాదు రెండు మాస్కులు పెట్టుకుంటే కానీ బయటకు రావడం లేదు. కానీ ఈ చైనా వోళ్లకు మాత్రం కరోనా ను అంటించి వారు మాత్రం ఇవేవీ తిరుగుతున్నారు. ఏకంగా 11 వేల మంది ఒకచోట గుమిగూడడం వివాదాస్పదమైంది.

ప్రపంచానికి కరోనా వైరస్ అంటించి చైనా మాత్రం ఏమాత్రం భయం, బెరుకు లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తోంది. మాస్కులు, శానిటైజర్ల బాధలు లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నారు చైనీయులు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్ నగరంలో ఒకే చోట 11 వేలమంది విద్యార్థులు మాస్కులు లేకుండా గుమిగూడడం పెద్ద దుమారం రేపింది.

భౌతిక దూరం లేకుండా విద్యార్థులంతా పక్కపక్కనే కూర్చున్నారు. వూహాన్ లోని విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలో ఈ సంఘటన జరిగింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

2019 డిసెంబర్ నెలలో వూహాన్ నగరంలో ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత కరోనా ప్రపంచం మొత్తానికి పాకి లక్షల మందిని చంపింది.కోట్ల మందికి ఈ వ్యాధి సోకింది.అయితే ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారితో పోరాడుతుంటే చైనాలో మాత్రం కరోనా అన్నది లేకుండా ప్రజలు, విద్యార్థులు మునుపటిలో ఉంటూ తెగ స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. చైనాలో జనజీవనం సాధారణంగా మారిపోవడం విశేషం.