Begin typing your search above and press return to search.

ఎయిర్‌ పోర్ట్‌ లో పని చేసిన 11మంది జవాన్లకు కరోనా

By:  Tupaki Desk   |   4 April 2020 10:10 AM GMT
ఎయిర్‌ పోర్ట్‌ లో పని చేసిన 11మంది జవాన్లకు కరోనా
X
దేశంలో కరోనా అదుపులోకి వస్తున్న సమయాన ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలతో వెలుగులోకి వచ్చాయి. అయితే మొదటి నుంచి అత్యధికంగా కరోనా కేసులు అధికంగా ఉ‍న్న రాష్ట్రం మ‌హారాష్ట్ర. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోర‌లు చాస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో మహారాష్ట్రవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ సమయంలో మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుత్ను సమయంలో విదేశీయులను విస్తృతంగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ముంబై విమాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జ‌వాన్‌లకు క‌రోనా వైర‌స్ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది.

విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల ద్వారానే జ‌వాన్లకు వైర‌స్ సోకి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో మహారాష్ట్రలో కలకలం రేగింది. ఇప్పటికే కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న సమయంలో ఇప్పుడు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌లకు కరోనా వైరస్‌ సోకడంతో వారి ద్వారా మరికొందరికి సోకి ఉంటుందని అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. అయితే ఈ కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ విధించకముందే వారికి సోకి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ విధించకముందు ముంబై విమానాశ్రయంలో విదేశీయులను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఈ జవాన్లు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వారికి కూడా సోకిందని అధికారులు భావిస్తున్నారు.

విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా ప్రజలు రాకపోకలు సాగించారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 142 మంది సీఐఎస్ ఎఫ్ జవాన్లను కొద్ది రోజులుగా క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో మొదట నలుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్ వచ్చింది. శుక్రవారం మరో ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ ఎఫ్ ప్రకటించింది. మ‌రో జ‌వాన్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు.

విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఐడీ కార్డులను చూడడం, వాష్ రూమ్‌లలో నీళ్ల ట్యాప్‌లను ముట్టుకోవడంతో జవాన్‌లకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మిగతా వారి రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. దేశ భద్రత కోసం పని చేసే వారికి కూడా కరోనా సోకడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మిగతా విమానాశ్రయాల్లో విధులు నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను కూడా ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌ కు తరలించినట్లు సమాచారం. వారి నమూనాలను కూడా పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపారు. వారి రిపోర్టులు రావాల్సి ఉంది.