నిన్న కేసీఆర్ ఇంట్లో ..నేడు జగన్ ఇంట్లో ...కరోనా కలకలం !

Sat Jul 04 2020 20:30:49 GMT+0530 (IST)

10 people positive in CM Jagan house!

ఏపీపై కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. టెస్టులు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఏపీలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది కరోనా భారిన పడుతున్నారు. తాజాగా  తాడేపల్లి జగన్ నివాసం వద్ద కూడా కరోనా కేసులు నమోదైనట్లుగా ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.  ఏపీలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో ఇప్పటివరకూ 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు గా తేలిందని ప్రచారం జరుగుతుంది.  ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరు గార్డులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అలాగే ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారని అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించగా ఈ పలితాల్లో పది మందికి  పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన అయితే  రాలేదు.

ఇక నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలిందని దీనితో అధికారులు ప్రగతి భవన్ ను శానిటైజ్ చేస్తున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ దీనిపై కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన అయితే లేదు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల సీఎంలకు కూడా కరోనా సెగ తగిలింది అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.