Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందాల శ్వేత కవ్వింపులు

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌.

By:  Ramesh Palla   |   3 Sept 2025 11:08 AM IST
పిక్‌టాక్‌ : అందాల శ్వేత కవ్వింపులు
X

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌. మొదటి సినిమాలో క్యూట్‌గా డైలాగ్‌లు చెబుతూ, అందంగా అలరించిన శ్వేతా బసు టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. బుల్లి తెర, వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ శ్వేత బసు కనిపించి కన్నుల విందు చేసింది. కొత్త బంగారు లోకం తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన శ్వేతా బసు ప్రసాద్‌ కెరీర్‌ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. తెలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్న శ్వేత బసు ఆ మధ్య కొన్ని కారణాల వల్ల వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడింది. వాటి నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తున్న శ్వేత బసు ప్రసాద్‌ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.

శ్వేతా బసు కొత్త లుక్‌

ఈ మధ్య కాస్త సన్నగా కనిపించిన శ్వేతా బసు ప్రసాద్‌ ఇటీవల బరువు పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో శ్వేత బసు ప్రసాద్‌ హీరోయిన్‌గా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయినా కూడా సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గతంతో పోల్చితే శ్వేతా బసు ప్రసాద్‌ మరింత అందంగా కనిపిస్తుందని, కొత్త బంగారు లోకం సినిమాలో ఎలా అయితే ఫ్రెష్‌ గా కనిపించిందో ఇప్పుడు అలాగే కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్‌ యొక్క అందాల ఆరబోతకు ఈ ఫోటోలు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ లైక్ చేస్తున్నారు. క్లీవేజ్‌ షో తో కవ్విస్తున్న అందాల శ్వేత ఫోటోలు చూపు తిప్పనివ్వడం లేదు.

కొత్త బంగారు లోకం హీరోయిన్‌

శ్వేతా బసు ప్రసాద్‌ 2002లో మక్దీ అనే సినిమాలో నటించడం ద్వారా ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇక్బాల్‌ సినిమాలో కాస్త పెద్ద అమ్మాయిగా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 2008 సంవత్సరంలో కొత్త బంగారు లోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆకట్టుకుంది. అదే సమయంలో హిందీలోనూ ఈమె సినిమాను చేయాలని భావించింది. కానీ హిందీలో ఈమెకు చిన్నప్పుడు వచ్చిన తరహాలో సినిమా ఆఫర్లు రాలేదు. దాంతో సౌత్‌లోనే ఈమె హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించడం ద్వారా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వెబ్‌ సిరీస్‌ల్లో శ్వేతాబసు ప్రసాద్‌

బీహార్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించిన శ్వేతా ప్రసాద్‌ ముంబైకి ఆమె ఫ్యామిలీ వెళ్లింది. అక్కడ ఇండస్ట్రీలో పరిచయాల కారణంగా చిన్నప్పుడే సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. కుహానీ ఘర్ ఘర్ కీ టీవీ సీరియల్‌లో నటించే అవకాశాలు దక్కించుకుంది. 2005లో దర్శకుడు నగేష్‌ కుకునూర్‌ ఈమెకు అవకాశం ఇచ్చాడు. ఇండస్ట్రీలో కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం ద్వారా తన సత్తా చాటాలని భావిస్తున్నారు. బాల నటిగా అవార్డ్‌ను సొంతం చేసుకున్న శ్వేత బసు ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచి సినిమా ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.