Begin typing your search above and press return to search.

నయన్ యాక్షన్ డోస్.. బీభత్సమే!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి దక్షిణాది ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  saisumeeth   |   17 July 2023 12:08 PM GMT
నయన్ యాక్షన్ డోస్.. బీభత్సమే!
X

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి దక్షిణాది ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దశాబ్దానికి పైగా దక్షిణాదిన సినిమాలు చేస్తూ, ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అయితే, ఆమె ఈ సారి బాలీవుడ్ ప్రజలను కూడా తన నటనతో మెస్మరైజ చేయడానికి రెడీ అయ్యారు.


ఆమె బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం జవాన్. షారూక్ ఖాన్ హీరోగా నటిస్తున్నఈ మూవీ త్వరోలనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నయన్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ పోస్టర్ లో నయన్ సీరియస్ గా గట్టుపట్టుకొని ఉన్నారు. కళ్లకు కళ్లజోడు త ఆమె లుక్ చాలా డిఫరెంట్ గా కనపడుతోంది. కాగా, ఇది చూస్తుంటే, నయన్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చేసిందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

జవాన్ మూవీలో నయనతార హీరోయిన్ అంటే, షారూక్ తో రొమాన్స్, డ్యాన్స్ లాంటి సీన్స్ ఉంటాయోమే అనుకున్నాం. కానీ, ఇలాంట పాత్ర అని ఊహించలేదు. ఈ లుక్ తో ఆమె ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మూవీకి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక షారూక్ భార్య గౌరీ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక, నయన్ విషయానికి వస్తే, ఆమె తమిళ డైరెక్టర్ విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరోగసి విధానంలో ఆమె తల్లిగా కూడా మారారు. కాగా, ఓ వైపు తల్లిగా పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే, మరో వైపు సినిమాలతో అదరగొడుతున్నారు.

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే, ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్, సంజయ్ దత్, దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక జవాన్ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్’తో చివరిగా షారుఖ్ ఖాన్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.