Begin typing your search above and press return to search.

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత వంగవీటి రాధాకు విజయవాడ మేయర్ పదవి దక్కింది. ప్రమాణ స్వీకారానికి కూటమి పార్టీల కీలక నేతలను స్వయంగా ఆహ్వానించడం ద్వారా గతంలో ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విజయవాడలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడంపైనే రాధా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

By:  Garuda Media   |   24 Nov 2026 5:53 AM IST
గుడ్  డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!
X

వంగ‌వీటి రాధా. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా ఆయ‌న ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. వంగ‌వీటి కుటుంబానికి.. అం దునా.. రంగా వార‌సుడికి ఈ ప‌ద‌వి ద‌క్క‌డాన్ని పార్టీల‌కు అతీతంగా 60 శాతం మంది నాయ‌కులు.. న‌గరంలోని 80 శాతం మంది ప్ర‌జ‌లు కూడా హ‌ర్షిస్తున్నారు. రాధా ప్ర‌మాణ స్వీకార వేడుక నేప‌థ్యంలో రంగా కు అత్యంత బ‌ల‌మైన ప్రాంతంగా ఉన్న గుణ‌ద‌ల‌, మాచ‌వ‌రం, కృష్ణ‌లంక‌, బ‌స్టాండ్ ఏరియా, సింగ్‌న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇది.. మంచిదే. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. రాధాకు ప‌ద‌వి ల‌భించింది.

ఈ క్ర‌మంలో రాధా విష‌యంలో వ‌చ్చిన కీల‌క‌మైన మార్పుపై కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ న‌డుస్తుండ‌డం గ‌మ నార్హం. గ‌తంలో 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న కొన్ని వ‌ర్గాలకు దూర‌మ‌య్యారు. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని దూరం చేసుకున్నారు. దీనివ‌ల్ల ఆయ‌న ల‌బ్ధి పొందారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. ఎదుగుద ల విష‌యంలో మాత్రం ఎదురీత త‌ప్ప‌లేదు. తాజాగా ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు ప‌డ్డారు. ముఖ్యంగా కూట‌మి పార్టీల‌తో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించ‌డం.. తాజాగా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు.

త‌న ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించి.. కీల‌క నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా.. స్వ‌యంగా ఆయ‌న ఆహ్వాన ప‌త్రిక‌లు అందించార‌ని రాధా అనుచ‌రులు చెబుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌చారం క‌న్నా.. ప‌నికే ప్రాధా న్యం ఇచ్చార‌ని చెబుతున్నారు. దీంతో ముభావంగా ఉన్న నాయ‌కులు కూడా రాధాతో క‌లిసిపోయార‌ని అంటున్నా రు. ఇది ముందుముందు ఆయ‌న ప‌నితీరుకు మార్కులు వేసేందుకు.. క‌లివిడికి.. ఇబ్బందులు లేకుండారాకుండా కూడా చూసుకునేందుకు అవ‌కాశాన్ని మెరుగు ప‌రుస్తుంద‌ని అంటున్నారు.

విజ‌య‌వాడ వంటి భిన్న‌మైన వాతావ‌ర‌ణం.. అనేక అభివృద్ధి ప‌నుల‌కు అవ‌కాశం ఉన్న న‌గ‌రంలో మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకోవ‌డం అంటే క‌త్తిపై సాము లాంటి చ‌ర్యేన‌ని చెప్పాలి. ఎటు చూసినా.. టీడీపీ గాలి వీస్తోంది. పైగా.. న‌గ‌రంలో జ‌న‌సేన కంటే కూడా.. టీడీపీ ప్రాబ‌ల్య‌మే ఎక్కువ‌గా ఉంది. ఈ ప‌రిస్థితి ఒంటెత్తు పోక‌డ‌లు పోకుండా.. రాధా అంద‌రినీ క‌లుపుకొని వెళ్లేందుకు ఇచ్చిన ప్రాధాన్యం మంచి మార్కులు వేయిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌విని ఆశించిన ఓ వ‌ర్గం టీడీపీనేతలు కూడా.. రాధా ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావ‌డం ఆయ‌నలో వ‌చ్చిన మార్పున‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.