Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ మహిళలు మృతి!

విదేశాల్లో రకరకాల కారణాలతో మృత్యువాత పడిన భారతీయులు, అందునా తెలుగువారి జాబితాలో మరో ఇద్దరు మహిళలు చేరడం తీవ్ర విషాదకరంగా మారుతోంది.

By:  Raja Ch   |   29 Dec 2025 3:55 PM IST
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ మహిళలు మృతి!
X

విదేశాల్లో రకరకాల కారణాలతో మృత్యువాత పడిన భారతీయులు, అందునా తెలుగువారి జాబితాలో మరో ఇద్దరు మహిళలు చేరడం తీవ్ర విషాదకరంగా మారుతోంది. ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లిన భారతీయులు చాలా మంది ఈ ఏడాది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

అవును... ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా... బాధితులను పులఖండం మేఘనా రాణి (25), కడియాల భావన (24)గా అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందినవారు!

వీరిద్ధరూ మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేశారు. ఈ క్రమంలో భావన ఇటీవలే అమెరికాకు వెళ్లారని అంటున్నారు! ప్రస్తుతం ఇద్దరూ ఉద్యోగ వేటలో ఉన్నారని చెబుతున్నారు. వీరిద్దరూ సన్నిహిత స్నేహితులని.. ఇద్దరూ కలిసి నివసిస్తున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి! వీరిలో మేఘన తండ్రి నాగేశ్వరరావు.. గార్ల మండలోనే మీ-సేవా కేంద్రాన్ని నడుపుతుండగా.. కడియాల భావన తండ్రి ముల్కనూర్ గ్రామానికి డిప్యూటీ సర్పంచ్ గా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో... వీరిద్దరి ఆకస్మిక మరణాలు వారి కుటుంబాలను, స్థానిక సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. మరోవైపు.. మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి కుటుంబాలు ప్రయత్నాలు ప్రారంభించాయని తెలుస్తోంది. ఈ సమయంలో.. వీరి మృతదేహాలను స్వదేశాలకు పంపే ఖర్చులను భరించటానికి "గో ఫండ్ మీ" నిధుల సేకరణ పేజీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో.. సాయం చిన్నదైనా, ఈ సమయంలో పదాలు వ్యక్తపరచలేని దానికంటే మాకు ఎక్కువ అని ఆ పేజీ చెబుతోంది!