అమెరికాలో 1.6 కోట్లు సంపాదించిన పాలక్ పనీర్ వివాదం.. దేశవిదేశాల్లో హాట్ టాపిక్
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి వివక్షకు మరోసారి అద్దం పట్టే ఘటన ఇది. సాధారణంగా తినే పాలక్ పనీర్ ఓ భారతీయ దంపతుల జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.
By: A.N.Kumar | 15 Jan 2026 12:56 AM ISTఅమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి వివక్షకు మరోసారి అద్దం పట్టే ఘటన ఇది. సాధారణంగా తినే పాలక్ పనీర్ ఓ భారతీయ దంపతుల జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. వివక్షతో జరిగిన అవమానం చివరకు న్యాయపోరాటంగా మారి, అమెరికా యూనివర్సిటీ నుంచి రూ.1.6 కోట్ల భారీ పరిహారం దక్కేలా చేసింది. ఇప్పుడు ఈ “పాలక్ పనీర్ వివాదం” దేశవిదేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో భారతీయల మీద వివక్ష చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే అలాంటిదే ఒక కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివక్ష చూపించిన వారు భారతీయులకు భారీ మొత్తంలోనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పాలక్ పనీర్ వివాదం..
2023లో ఇండియా నుంచి ఆదిత్య ప్రకాశ్ అనే పీహెచ్డీ విద్యార్థి ఉన్నత చదువుల కోసం తన భార్య ఊర్మి భట్టాచార్యతో కలిసి అమెరికా వెళ్లారు. సెప్టెంబర్ 5, 2023లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో పాలక్ పనీర్ వేడి చేసుకుంటున్నారు. ఇంతలోనే స్టోర్ ఉద్యోగి ఒకరు అభ్యంతరం తెలిపారు. పాలక్ పనిర్ వాసన తీవ్రంగా ఉందంటూ, అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ మాట్లాడింది. అది పాలక్ పనిర్ అనే ఆహారమని, వేడి చేసుకున్నాక వెళ్లిపోతానని చెప్పినా వినకుండా .. ఆ ఉద్యోగి ఆదిత్య ప్రకాశ్ పట్ల ప్రవర్తించింది.
భార్య కూడా అదే అవమానం...
ఆ ఘటన తర్వాత ఆదిత్య భార్య ఊర్మి పట్ల యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో సిబ్బంది కూడా జాతి వివక్షతో వేధించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఆమె స్టైఫండ్ తొలగించారు. దీంతో ఈ రెండు ఘటనలపై ఆదిత్య ప్రకాశ్ దంపతులు సిబ్బందిపైన, యూనివర్శిటీపైన ఆదిత్య ప్రకాశ్ దంపతులు పరువునష్టం దావా వేశారు. రెండేళ్ల పోరాటం తర్వాత వివాదాన్ని పరిష్కరించుకునేందుకు యూనివర్శిటి ఒప్పుకుంది. దాదాపు వారికి 200 వేల డాలర్ల పరిహారం ప్రకటించింది. అంటే మన రూపాయల్లో 1.6 కోట్లు. ఆ తర్వాత యూనివర్శిటీ నుంచి వెళ్లిపోవాలని కోరడంతో వారు అంగీకరించి వచ్చేశారు. మళ్లీ యూఎస్ వెళ్లే ఆలోచన కూడా తమకు లేదని చెప్పారు. అమెరికాలో జరిగిన అవమానం ఆ దంపతులకు 1.6 కోట్ల రూపాయలను సంపాదించిపెట్టింది.
