Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో ఆత్మహత్య సవాల్.. ఎన్నారై బాలుడు మృతి.. ఏమిటీ రోబ్లాక్స్..?

అవును... ఉత్తర కరోలినాలోని షార్లెట్ ప్రాంతంలో 12 ఏళ్ల ఎన్నారై బాలుడు ప్రముఖ గేమింగ్ ఫ్లాట్ ఫామ్ రోబ్లాక్స్ లో అత్యంత ప్రమాదకరమైన సూసైడ్ సవాల్ ను స్వీకరించినట్లు చెబుతున్నారు.

By:  Raja Ch   |   27 Nov 2025 9:35 AM IST
ఆన్  లైన్  లో ఆత్మహత్య సవాల్.. ఎన్నారై బాలుడు మృతి.. ఏమిటీ రోబ్లాక్స్..?
X

తల్లితండ్రులు తమ పిల్లల ఆన్ లైన్ కార్యకలాపాలను (సోషల్ మీడియా స్నేహాలు, వీడియో గేమ్ లు...) పర్యవేక్షించాలని.. డిజిటల్ ప్రమాదాల గురించి బహిరంగ సంభషణలు నిర్వహించాలని నిపుణులు నిత్యం సూచిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులో ఉన్న భద్రతా చర్యలను ఉపయోగించుకోవాలని సూచిస్తుంటారు.

అయినప్పటికీ తల్లితండ్రులకు అంత తీరిక లేకో.. లేక, పిల్లలు ప్రైవసీ అనే మాటలు మాట్లాడటం వల్లో అది సాధ్యం కావడం లేదు! దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. తల్లితండ్రులకు అంత అవగాహన లేకపోవచ్చు, తీరికా లేకపోవచ్చు, పిల్లలపై మితిమీరిన ప్రేమ కూడా అయ్యి ఉండొచ్చు! ఈ క్రమంలో తాజాగా రోబ్లాక్స్ లో సూసైడ్ సవాల్ స్వీకరించిన ఓ బాలుడు మృతి చెందాడు.

అవును... ఉత్తర కరోలినాలోని చార్లొట్టే ప్రాంతంలో 12 ఏళ్ల ఎన్నారై బాలుడు ప్రముఖ గేమింగ్ ఫ్లాట్ ఫామ్ రోబ్లాక్స్ లో అత్యంత ప్రమాదకరమైన సూసైడ్ సవాల్ ను స్వీకరించినట్లు చెబుతున్నారు. దీంతో ఘోరం జరిగిపోయిందని తెలుస్తోంది. ఆ ఛాలెంజ్ ను సదరు బాలుడు స్వీకరించిన అనంతరం.. అతడికి అత్యంత ప్రమాదకరమైన సూచనలు ఇవ్వబడ్డాయని అంటున్నారు.

ఈ క్రమంలో ఆ ప్రమాదకరమైన సూచనలను అతడు పాటించడం వల్ల అది అతని మరణానికి దారితీసిందని చెబుతున్నారు. దీంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇదే సమయంలో నెట్టింట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తెరపైకి వచ్చిన ఈ ఘటన.. ఆన్ లైన్ వేదికగా పలు అంశాలకు అడిక్ట్ అవుతున్న పిల్లల పరిస్థితి, అర్ధాంతరంగా ముగిసిపోతోన్న వారి జీవితం గురించిన చర్చను తెరపైకి తెచ్చింది.

కాగా... రోబ్లాక్స్ అనేది ఒక ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్, గేమ్ క్రియేషన్ వ్యవస్థ. ఇది వర్చువల్ విశ్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో పాల్గొనేవారు అవతార్ లను సృష్టించుకుని.. వారి స్వంతంగా లేదా ఇతర వినియోగదారులతో గేమ్ లు ఆడటానికి అనుమతి ఇస్తుంది. 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల యూఎస్ పిల్లల్లో సుమారు మూడింట రెండు వంతుల మంది ఈ ప్లాట్ ఫామ్ లో గేమ్ లు ఆడుతున్నారని చెబుతున్నారు.