Begin typing your search above and press return to search.

'భార‌తీయులు బానిస‌లు'.. త‌ప్పు చేశా: వాన్స్‌

`భార‌తీయ కార్మికులు, ఉద్యోగులు బానిస‌లు` అంటూ తెంప‌రి త‌నంతో చిందులేసిన అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ త‌న త‌ప్పు తెలుసుకున్నాన‌ని చెప్పారు.

By:  Garuda Media   |   19 Oct 2026 8:57 AM IST
భార‌తీయులు బానిస‌లు..  త‌ప్పు చేశా: వాన్స్‌
X

`భార‌తీయ కార్మికులు, ఉద్యోగులు బానిస‌లు` అంటూ తెంప‌రి త‌నంతో చిందులేసిన అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ త‌న త‌ప్పు తెలుసుకున్నాన‌ని చెప్పారు. తాను అలా మాట్లాడి ఉండ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. గ‌త 15 రోజు ల కింద‌ట‌.. వాన్స్ హెచ్‌1బీ వీసాల వ్య‌వ‌హారంపై మాట్లాడుతూ.. అమెరికాలో ప‌నిచేస్తున్న‌ భార‌తీయ ఉద్యోగులు, కార్మికుల‌ను బానిస‌లుగా అభివ‌ర్ణించారు. వారివ‌ల్లే అమెరికాలో నిరుద్యోగులు పెరుగుతున్నార‌ని వాన్స్ ఈస‌డించు కున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. భార‌త్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌య ప్ర‌తినిధిని ర‌ప్పించిన భార‌త విదేశాంగ శాఖ‌.. ఆయ‌న‌కు ఆక్షేప‌ణ తెలియ‌జేసింది. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయ ని.. ఇలాంటి స‌మ‌యంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ.. వాన్స్ ఆ త‌ర్వాత స్పం దించ‌లేదు. కానీ.. తాజాగా వాన్స్ స్పందిస్తూ.. భార‌తీయుల‌పై తాను చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని ఒప్పుకొన్నారు. అలా వ్యాఖ్యానించి ఉండ‌కూడ‌ద‌ని అన్నారు.

``భారతీయులు మాకు మిత్రులు, స‌న్నిహితులు. వారిపై మాకు అభిమానం ఉంది. ఆ రోజు నేను ఫ్రెస్ట్రేష‌న్‌లో ఉన్నా. అందుకే అలా వ్యాఖ్యానించారు. హెచ్‌1బీ వీసాల కార‌ణంగా.. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. ఇత‌ర దేశాల‌కు చెందిన కార్మికులు త‌క్కువ వేత‌నానికి ల‌భిస్తుండ‌డంతో అమెరికాలో నిరుద్యోగుల‌కు ప‌నులు ల‌భించ‌డం లేద‌ని అన్నారు. అందుకే.. ఆ రోజు ఆగ్ర‌హంలో తాను వ్యాఖ్య‌లు చేశా``న‌ని అన్నారు. కానీ, ఎక్క‌డా తాను భార‌తీయ‌త‌కు, భార‌తీయ పౌరులకు వ్య‌తిరేకం కాద‌న్నారు.

ట్రంప్ మౌనం..

అమెరికా ఉపాధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై అధ్య‌క్షుడు ట్రంప్ మౌనం వ‌హించారు. ఎక్క‌డా కూడా ఆయ‌న స్పందిం చలేదు. అయితే.. హెచ్‌1బీ వీసాల విష‌యంపై మాత్రం ట్రంప్ కూడా సీరియ‌స్‌గా ఉన్నారు. స్థానికంగా పెరుగుతు న్న నిరుద్యోగం, ఉపాధిక‌ల్ప‌న లేమి వంటివి అమెరికాను కుదిపేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వాన్స్ వ్యాఖ్యానించార‌ని అమెరికా ప‌త్రిక‌లు అప్ప‌ట్లో పేర్కొన్నాయి.