Begin typing your search above and press return to search.

డిగ్రీలు పక్కనపెట్టండి.. ఫాలోవర్స్ పెంచండి.. అమెరికా వీసా కావాలంటే 'లైక్స్' ఉండాల్సిందేనా?

ఒకప్పుడు అమెరికా వెళ్లాలంటే చేతిలో ఇంజినీరింగ్ డిగ్రీ మెదడులో కోడింగ్ నైపుణ్యం.. అన్నిటికీ మించి 'హెచ్-1బి' లాటరీలో అదృష్టం ఉండాలి.

By:  A.N.Kumar   |   7 Jan 2026 4:00 PM IST
డిగ్రీలు పక్కనపెట్టండి.. ఫాలోవర్స్ పెంచండి.. అమెరికా వీసా కావాలంటే లైక్స్ ఉండాల్సిందేనా?
X

ఒకప్పుడు అమెరికా వెళ్లాలంటే చేతిలో ఇంజినీరింగ్ డిగ్రీ మెదడులో కోడింగ్ నైపుణ్యం.. అన్నిటికీ మించి 'హెచ్-1బి' లాటరీలో అదృష్టం ఉండాలి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ల్యాప్‌టాప్ ముందు కూర్చుని కోడింగ్ రాసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంటే కెమెరా ముందు చిందేసే ఇన్‌ఫ్లూయెన్సర్‌కే అమెరికా తలుపులు త్వరగా తెరుచుకుంటున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్!

ల్యాప్‌టాప్‌లో 'లైవ్' పర్ఫార్మెన్స్.. దర్శన్ వ్యథ

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బాయ్ త్రోబ్' అనే మ్యూజిక్ బ్యాండ్ సెన్సేషన్ సృష్టిస్తోంది. జెన్-జీ ని ఉర్రూతలూగించే ఈ బ్యాండ్‌లో దర్శన్ అనే యువకుడు ఒక సభ్యుడు. విచిత్రం ఏమిటంటే.. అమెరికాలో స్టేజ్ మీద తన బ్యాండ్ మేట్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే.. దర్శన్ మాత్రం ల్యాప్‌టాప్ స్క్రీన్ ద్వారా ఇండియా నుంచి జాయిన్ అవుతున్నాడు. దీనికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు.. వీసా దొరకకపోవడం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దర్శన్ తన వీసా కోసం తన విద్యార్హతలపై కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లపై ఆశలు పెట్టుకున్నాడు. "మా బ్యాండ్ ఇంకా ఫేమస్ కావాలి, అప్పుడే నాకు వీసా వస్తుంది" అని అతను చెప్పే మాటలు నేటి డిజిటల్ యుగపు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.

O-1 వీసా.. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ' అంటే ఇదేనా?

సాధారణంగా టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. కానీ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు O-1 వీసాను టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం "అసాధారణ ప్రతిభ" ఉన్నవారికి మాత్రమే ఇచ్చే వీసా. గతంలో ఇది నోబెల్ విజేతలు, ఆస్కార్ విన్నర్లు లేదా అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు మాత్రమే దక్కేది. కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్లు కొత్త వాదనలు వినిపిస్తున్నారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండడం అనేది కల్చరల్ ఇంపాక్ట్‌కు నిదర్శనం... వైరల్ కంటెంట్ ను గ్లోబల్ గుర్తింపుగా పరిగణించడం ముఖ్యం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే సామర్థ్యం డిజిటల్ ఆదాయంకు ఉంటుంది. వీటినే ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరీ ప్రతిభకు ఆధారాలుగా చూపిస్తూ యూట్యూబర్లు, టిక్‌టాకర్లు చివరకు అడల్ట్ కంటెంట్ క్రియేటర్లు కూడా అమెరికా వీసాలు పొందుతున్నారు.

అటెన్షన్.. అదే కొత్త కరెన్సీ!

ఏళ్ల తరబడి కష్టపడి చదివిన చదువు, సంపాదించిన డిగ్రీలు చేయలేని పనిని.. కొన్ని లక్షల 'లైక్స్' చిటికెలో చేసి చూపిస్తున్నాయి. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఇప్పుడు కోడింగ్ క్లాసుల కంటే రీల్స్ ఎలా వైరల్ చేయాలనే చిట్కాలే ఎక్కువ ఉపయోగపడుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వీసా ఆఫీసర్ మీ మార్కుల లిస్ట్ అడిగేవాడు. ఇప్పుడు మీ సోషల్ మీడియా హ్యాండిల్ అడుగుతున్నాడు. మీ ప్రతిభకు కొలమానం మీ సర్టిఫికేట్ కాదు.. మీ ప్రొఫైల్‌కు ఉన్న 'బ్లూ టిక్' గా చెప్పొచ్చు.

ఈ పరిణామం కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయంగా అనిపించవచ్చు. కానీ మారుతున్న కాలంలో 'అటెన్షన్' అనేది ఒక ఖరీదైన కరెన్సీగా మారిపోయింది.