రష్యాలో వీధులు శుభ్రం చేస్తున్న ఇండియన్ టెకీ... విషయం ఏమిటంటే..!
నేను భారతీయుడిని.. భారతీయుడికి ఉద్యోగం పట్టింపు లేదు.. అతనికి పనే దేవుడు.. మీరు ఎక్కడినా పని చేయవచ్చు.. టాయిలెట్ లో, వీధిలో, ఎక్కడైనా..
By: Raja Ch | 22 Dec 2025 3:00 AM ISTనేను భారతీయుడిని.. భారతీయుడికి ఉద్యోగం పట్టింపు లేదు.. అతనికి పనే దేవుడు.. మీరు ఎక్కడినా పని చేయవచ్చు.. టాయిలెట్ లో, వీధిలో, ఎక్కడైనా.. ఇది నా ఉద్యోగం, నా విధి, నా బాధ్యత.. దీన్ని సాధ్యమైనంta బాగా చేయాలి.. అంతే అని చెబుతున్నాడు 26 ఏళ్ల ముఖేష్ మండల్. నాలుగు నెలలుగా రష్యాలో పని చేస్తున్న 17 మంది భారతీయ కార్మికులలో ఇతను ఒకడు. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేసినట్లు చెబుతున్నాడు.
అవును... ప్రపంచంలోనే అతిపెద్ద దేశంలో కార్మికుల కొరత మధ్య భారత వలసదారుల బృందం రష్యా వీధులను శుభ్రం చేస్తోంది. సుమారు నాలుగు నెలల క్రితం రష్యా చేరుకున్న 17 మంది భారతీయ కార్మికుల బృందంలో ముఖేష్ కూడా ఒకరు. ఇతడు అనేక వారాలుగా సెయింట్ పీటర్స్ బర్గ్ వీధులను శుభ్రం చేస్తున్నాడు. ఇతడు రోడ్డు నిర్మాణ సంస్థ కొలోమియాజ్స్కోయ్ లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రష్యన్ వార్తా సంస్థతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా... కొలోమియాజ్స్కోయ్ 17 మంది భారతీయులను రష్యాకు తీసుకురావడమే కాకుండా వారికి ఆహారం, వసతిని అందించిందని తెలిపాడు. వీరు సుమారు రూ.1.1 లక్ష చెల్లిస్తున్నారని తెలిపారు. తానేను ఎక్కువగా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో పనిచేశానని.. ఏఐ, చాట్ బాట్ లు, జీపీటీ వంటి కొత్త సాధనాలను ఉపయోగించానని.. తాను నేను డెవలపర్ ని అని వివరించాడు. తనకు డబ్బులు సంపాదించడమే ముఖ్యమని అన్నాడు!
ఈ సందర్భంగా స్పందించిన కొలోమియాజ్స్కోయ్ లోని క్లీనింగ్ సెక్షన్ యాక్టింగ్ హెడ్ మరియా త్యాబినా... తమ వద్ద పనిచేసే వారికి ఆహారం, వసతితో పాటు రక్షణ దుస్తులను అందిస్తామని తెలిపారు. ఇదే సమయంలో రవాణా సౌకర్యాన్ని అందిస్తామని వెల్లడించారు. తమవద్ద ఉన్న వలస కార్మికులలో 19 - 43 ఏళ్ల మధ్య వయసు గలవారు ఉన్నారని.. వీరంతా భారత్ నుంచి వచ్చినప్పటికి పలు రకాల ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నారని తెలిపారు.
ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న భారతీయ కార్మికుల్లో.. రైతులు, సొంత వ్యాపారాలు కలిగిన వారు, వెడ్డింగ్ ప్లానర్లు, చర్మకారుడు, డ్రైవర్లు, ఆర్కిటెక్ట్ లు ఉన్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను సాఫ్ట్ వేర్ డెవలపr గా పనిచేసినట్లు తెలిపాడని వెల్లడించారు. ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
