Begin typing your search above and press return to search.

ట్రంప్ 'గ్రీన్ కార్డ్' బ్రేకులకు ఇండియన్ జడ్జి 'చెక్‌మేట్'!

అమెరికా కలలు కనేవారికి ఒక శుభవార్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గారి డిపార్ట్‌మెంట్‌కి ఒక పెద్ద 'షాక్' గ్రీన్ కార్డ్‌ల మీద ట్రంప్ సర్కార్ వేసిన బరువైన తాళాలను.. మన ఇండియన్ సంతతి ఫెడరల్ జడ్జి అమిత్ మెహతా ఒక్క దెబ్బతో పగలగొట్టేశారు

By:  A.N.Kumar   |   6 Aug 2026 4:41 PM IST
ట్రంప్ గ్రీన్ కార్డ్ బ్రేకులకు ఇండియన్ జడ్జి చెక్‌మేట్!
X

అమెరికా కలలు కనేవారికి ఒక శుభవార్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గారి డిపార్ట్‌మెంట్‌కి ఒక పెద్ద 'షాక్' గ్రీన్ కార్డ్‌ల మీద ట్రంప్ సర్కార్ వేసిన బరువైన తాళాలను.. మన ఇండియన్ సంతతి ఫెడరల్ జడ్జి అమిత్ మెహతా ఒక్క దెబ్బతో పగలగొట్టేశారు. "అయ్యా ట్రంప్ గారూ.. రూల్ బుక్ మీ చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ఉచితంగా ప్యాకేజీ డీల్స్ లాగా దరఖాస్తులన్నింటినీ ఒకేసారి పక్కన పడేస్తామంటే కుదరదు" అంటూ కోర్టు హాలులోనే ఓ రేంజ్‌లో స్వీట్ కౌంటర్ ఇచ్చారు.

ఇంతకీ ఆ 'విచిత్రమైన' నియమం ఏంటి?

కథేంటంటే.. రేపు పొద్దున ఈ విదేశీయులు అమెరికా వచ్చి అక్కడ సర్కారు ఇచ్చే ఉచిత సంక్షేమ పథకాల మీద బతికేస్తారేమో అనే ఒక ఊహాజనిత 'రాశిఫలాలు' చూసి అందరి గ్రీన్ కార్డ్ అప్లికేషన్లను ఒకే దారంతో కట్టేసి పెండింగ్‌లో పడేశారు. మార్కో రుబియో గారి నాయకత్వంలో స్టేట్ డిపార్ట్‌మెంట్ నడిపిన ఈ మాస్టర్ ప్లాన్‌కి ఒక బ్రెజిల్ ఇన్వెస్టర్ పుల్ల పెట్టాడు. "అయ్యా.. నా దగ్గర పైసలున్నాయి, ఈబీ-5 వీసా కింద పెట్టుబడి పెట్టా.. నా అప్లికేషన్ కూడా పక్కన పడేస్తే ఎలా?" అని కోర్టు తలుపు తట్టాడు.

జడ్జి గారి చమత్కారపు తీర్పు

వాషింగ్టన్ డీసీ కోర్టులో జడ్జి అమిత్ మెహతా గారు తీర్పు చెప్తూ ప్రభుత్వానికి ఒక రకంగా "అయ్యా.. మీరు కాంగ్రెస్ ఇచ్చిన అధికారాల పరిధిని మర్చిపోయి కాస్త ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు" అని గుర్తుచేశారు. "ఎవరికి పడితే వారికి గ్రీన్ కార్డ్‌లు ఆపేసి రూల్స్ మార్చడానికి స్టేట్ డిపార్ట్‌మెంట్ ఏమైనా మీ సొంత షాపా? ప్రతి దరఖాస్తును మర్యాదగా వ్యక్తిగతంగా పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోండి అని స్పష్టం చేశారు.

మనోళ్లకు కలిగే అసలు లాభం

ఈ ఒక్క దెబ్బతో మన భారతీయులు సహా వేలాది మంది దరఖాస్తుదారుల గుండెల్లో గులాబీలు వికసించాయి. ఎన్నో ఏళ్లుగా "క్యూ లైన్ ఎప్పుడు కదులుతుందో" అని ఆశగా చూస్తున్న వారికి ఈ తీర్పు ఒక పెద్ద ఊరట. భవిష్యత్తులో ఇలాంటి అడ్డగోలు "హోల్‌సేల్ ఫ్రీజ్‌లు" పెట్టడానికి ప్రభుత్వానికి కొంచెం భయం.. ఇంకొంచెం బాధ్యత గుర్తొస్తాయి.. ఏదేమైనా ఆఫీసర్ల ఊహాగానాలకు బ్రేక్ పడి.. ఐటీ బాబులకు గ్రీన్ సిగ్నల్ దొరకడంతో.. ఇప్పుడు అమెరికా వీసా ఆఫీసుల ముందు మళ్లీ పండగ వాతావరణం నెలకొంది.