డాలర్ల వేటలో చితికిన బతుకులివీ..
అనాదిగా చితికిపోయిన బతుకులు మనవి.. ఒకప్పుడు మొగల్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని దండెత్తారు.
By: A.N.Kumar | 6 Dec 2025 10:51 AM ISTఅనాదిగా చితికిపోయిన బతుకులు మనవి.. ఒకప్పుడు మొగల్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని దండెత్తారు. వాళ్లను ఓడించి బ్రిటీష్ వారు నిరంకుశంగా పాలించారు. దేశాన్ని లూటీ చేశారు. అందుకే చితికిపోయిన బతుకులు బాగుపడాలని అగ్రరాజ్యాల వైపు చూశారు. భారతీయుల వలసలు మన దేశ స్వాతంత్ర్యం తర్వాత అవకాశాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయాయి. అమెరికా భారతీయులకు స్వర్గధామం అయ్యింది. అక్కడే మన ప్రతిభకు మంచి అవకాశాలు దక్కాయి.
అయితే కాలం మారింది. ట్రంప్ లాంటి గండరగండరడలు అధికారంలోకి వచ్చాడు. మన జీవితాలు తలకిందులవుతున్నాయి. డాలర్ల వేటలో లగ్జరీ లైఫ్ కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు వారి కలలు కల్లలయ్యాయి. డబ్బులు వస్తున్నా కూడా మనశ్శాంతి ఉండదని చాలా మంది ఫీల్ అవుతుంటారు.
కెనడాలో ఐదేళ్ల క్రితం నటి సంగతి ఇదీ.. ఐదేళ్ల క్రితం వరకూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఓ ఎన్నారై, అక్కడి యాంత్రిక జీవనానికి విసిగిపోయి జాబ్ కు రిజైన్ చేసి ఇండియా వచ్చేస్తున్నాడు. ఇక నావల్ల కాదంటూ ఆ రోబో జీవితం వద్దు అంటూ మాతృభూమి ఇండియాలో మన శాంతి కోసం వస్తున్నాడు. అతడి రెడిట్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రవాస భారతీయులు అందరికీ ఆలోచనలో పడేస్తోంది.
కెనడా అయినా అమెరికా అయినా డాలర్ల వేట.. లగ్జరీ లైఫ్ కానీ.. చూడ్డానికి బాగుంటుంది.. కానీ ఆ యాంత్రిక జీవితం జీవించడానికే విరక్తి కలిగిస్తుంది. అక్కడ మనకంటూ బంధువులు, తోబుట్టువులు ఉండరు. ఉన్న స్నేహితులదీ అదే గతి. అందకే ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉంటుంది. భారత్ లోని ఆర్గనైజ్డ్ ఖాయోస్ ను తాను బాగా మిస్ అవతున్నట్టు రాసుకొచ్చాడు. మన దేశంలో ఎప్పుడ కావాలంటే అప్పుడు ఫ్రెండ్స్ ను కలవొచ్చ. సడెన్ ప్లాన్స్ చేసుకోవచ్చు. రోజంతా వృథా అవ్వదు. కానీ విదేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఈ స్వేచ్ఛ లేని యాంత్రిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే జాబ్ మానేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇండియాకు బయలు దేరినట్టు కెనాడాలోకి టెకీ రాసిన ఈ కథనం అందరినీ ఆలోచింపచేస్తోంది.
కెనడాలో చలికాలం బయటకెళ్లలేం.. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. భయంకర చలిలో ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఒంటరిగా జీవించాలి అదో నరకం. ఇండియాలో పొల్యూషన్, సివిక్ సెన్స్ తక్కువగా ఉన్నా.. విమర్శించినా పర్లేదు.. మన ఇంటికాడ ఉన్న ఆ అనుభూతిని ఏ దేశమేగినా కొనలేం.. అనుభవించలేం అంటూ అతడు రాసిన రాతలు ఆలోచింపచేస్తున్నాయి..
నెటిజన్లు ఇప్పుడు ఇదే చర్చిస్తన్నారు. సంతోషం ఎక్కడుంటే అక్కడే జీవించాలని.. నీ ధైర్యానికి సలాం అంటూ కొనియాడతున్నారు. ఇదో మంచి నిర్ణయం అంటూ సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు, మనశ్శాంతి , సొంత మనుషుల మధ్య ఉండడమే అసలైన మనశ్శాంతి అని మరోసారి నిరూపితమైంది.
