Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా వెళ్లినా మీరు మారరా? ఏంటీ సామీ ఈ అరాచకం

ఒక వైపు మెల్‌బోర్న్ నగరంలో విదేశీయులు నిశ్శబ్దంగా తమ కార్లను నడుపుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక భారతీయ జంట రోడ్డు మధ్యలోకి ప్రత్యక్షమైంది.

By:  A.N.Kumar   |   2 Sept 2026 10:54 AM IST
ఆస్ట్రేలియా వెళ్లినా మీరు మారరా? ఏంటీ సామీ ఈ అరాచకం
X

మన వాళ్లు ఎక్కడికెళ్లినా సంస్కృతి, సంప్రదాయాలను అస్సలు మర్చిపోరు. అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అయినా.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం అయినా సరే.. మన ఇంట్లోని పాత పద్ధతులను జేబులో వేసుకుని సరిహద్దులు దాటించేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని టార్నైట్ ప్రాంతంలో వెలుగు చూసింది.

ఒక వైపు మెల్‌బోర్న్ నగరంలో విదేశీయులు నిశ్శబ్దంగా తమ కార్లను నడుపుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక భారతీయ జంట రోడ్డు మధ్యలోకి ప్రత్యక్షమైంది. ఆగస్టు 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కానంత వింతగా ఉంది. సదరు మహిళ తన భర్తతో కలిసి రోడ్డు కూడలి వద్దకు వచ్చి ఒక దీపాన్ని నడిరోడ్డుపై పెట్టింది. ఏదో పూజ చేస్తున్నట్లు వింత సైగలు చేసి, దిష్టి తీసినట్లుగా రోడ్డుపై ఆ దీపాన్ని అలాగే వదిలేసి అక్కడి నుంచి చెక్కేసింది.

ఇక అది చూసిన ఆస్ట్రేలియా స్థానికులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. "అసలు ఈ రోడ్డుపై బాంబు పెట్టారా? లేక ఏదైనా రహస్య సైన్స్ ప్రయోగం చేస్తున్నారా?" అని అర్థం కాక తెగ భయపడిపోయారట. మన దేశంలో అంటే చౌరస్తాల్లో దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, దీపాలు చూడటం అలవాటే. కానీ విదేశీయులకు ఇవన్నీ చూస్తే హారర్ సినిమా చూసినంత భయం వేయడంలో తప్పు లేదు కదా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు రంగంలోకి దిగి గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. దేశం దాటినా మారని 'దిష్టి' గోల మారదా? అని మండిపడుతున్నారు. "డాలర్లు సంపాదించడం వచ్చు కానీ పబ్లిక్ సెన్స్ నేర్చుకోవడం రాదా?" అని కొందరు క్లాస్ పీకుతున్నారు.అక్కడి అధికారులు గనక ఈ ఘటనను చూస్తే.. ఫైర్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించారనో, రోడ్డుపై చెత్త వేశారనో భారీ ఫైన్ బాదే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇండియా పరువు తీయకండి

"మీ నమ్మకాలు మీ ఇంట్లో చూసుకోండి సర్ నడిరోడ్డుపై దీపాలు పెట్టి ఆస్ట్రేలియా వాళ్లను భయపెట్టి భారతదేశ పరువు తీయకండి" అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మన నమ్మకాలు, ఆచారాలు ఏవైనా సరే.. వాటిని ఎక్కడ, ఎలా పాటించాలనే కనీస అవగాహన ఉండాలి. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి స్థానిక చట్టాలను, సామాజిక పరిస్థితులను గౌరవించడం చాలా ముఖ్యం. లేదంటే మన దిష్టి పరిహారాలు చూసి వాళ్లు మనకే పెద్ద 'దిష్టి' చుక్క పెట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.