Begin typing your search above and press return to search.

డ్ర*గ్స్, సె*క్స్... అమెరికాలో భారత సంతతి జంట అరెస్ట్!

అవును... అనేక రహస్య కార్యకలాపాల తర్వాత నేర కార్యకలాపాల కేంద్రంగా ఉన్న ఒక మోటల్‌ పై ఫెడరల్, స్థానిక ఏజెంట్లు దాడి చేశారు.

By:  Raja Ch   |   19 Jan 2026 3:00 PM IST
డ్ర*గ్స్, సె*క్స్... అమెరికాలో భారత సంతతి జంట అరెస్ట్!
X

అమెరికాలోని వర్జీనియాలో మాదకద్రవ్యాలు, లైంగిక అక్రమ రవాణా కేసులో భారత సంతతికి చెందిన జంటతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరాలకు కేంద్రంగా ఉన్న ఒక మోటల్‌ పై స్థానిక ఏజెంట్లు దాడి చేశారు. ఈ క్రమంలోనే కోషా శర్మ (52), తరుణ్ శర్మ (55) తమ రెడ్ కార్పెట్ ఇన్‌ లోని మూడవ అంతస్తును మాదకద్రవ్యాల అమ్మకాలు, వ్యభిచారం కోసం ఉపయోగించుకున్నారని.. అతిధులను కింది అంతస్తులలో ఉంచారని ఆరోపించారు.

అవును... అనేక రహస్య కార్యకలాపాల తర్వాత నేర కార్యకలాపాల కేంద్రంగా ఉన్న ఒక మోటల్‌ పై ఫెడరల్, స్థానిక ఏజెంట్లు దాడి చేశారు. ఈ క్రమంలో ఓ జంటతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కోర్టు పత్రాల ప్రకారం.. మే 2023 నుండి కోషా శర్మ, తరుణ్ శర్మ.. వ్యాపారం చేస్తున్నారని.. ఈ సందర్భంగా మోటల్‌ ను లీజుకు తీసుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అరెస్టులు జరిగాయని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. వివాహితులైన కోషా, తరుణ్ శర్మ.. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభంలో కొంత భాగాన్ని తీసుకుంటూ మోటల్ నుండి వ్యభిచారం, మాదకద్రవ్యాల ముఠాను నిర్వహించడానికి అనుమతించారని.. ఈ సమయంలో.. వేశ్యలు, మాదకద్రవ్యాల కోసం వెతుకుతున్న వ్యక్తులను మూడవ అంతస్తులో ఉంచేవారని.. పోలీసులు సంఘటనా స్థలానికి వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేసేవారని.. అధికారులను గదుల్లోకి ప్రవేశించకుండా చేసేవారని తెలిపారు.

ఈ క్రమంలో కోషా, తరుణ్ తో పాటు మరో ముగ్గురు.. 51 ఏళ్ల మార్గో పియర్స్, 40 ఏళ్ల జాషువా రెడ్డి, 33 ఏళ్ల రాషర్డ్ స్మిత్‌ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రిన్స్ విలియం కౌంటీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ.) నుండి రహస్య ఏజెంట్లు, వేశ్యలు, పింప్‌ లు, క్లయింట్‌ ల వేషంలో.. మోటెల్‌ ను కనీసం తొమ్మిది సార్లు సందర్శించారని చెబుతున్నారు. అక్కడ కనీసం 8 మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో హోటల్‌ లో రహస్య ఏజెంట్లు 15 వేర్వేరు మాదకద్రవ్యాల కొనుగోళ్లు కూడా చేశారని.. ఇందులో భాగంగా... పదకొండు సార్లు ఫెంటానిల్, నాలుగు సార్లు కొకైన్‌ ను తీసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టైన ఐదుగురు దోషులుగా తేలితే.. వారికి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అంటున్నారు.