న్యూయార్క్ టైమ్ స్క్వేర్ సాక్షిగా లవ్ ప్రపోజల్.. సినిమాను తలపించారుగా!
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోందనే విషయం ఇట్టే క్షణాల్లో తెలిసిపోతుంది.
By: Madhu Reddy | 1 Dec 2025 7:00 PM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోందనే విషయం ఇట్టే క్షణాల్లో తెలిసిపోతుంది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. ముఖ్యంగా చాలామంది యువత సినిమా స్టైల్ లో లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కుదరదు. కారణం తమ ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలియకపోవడం లేదా మరేదైనా ఇతర కారణాలవల్ల తమ ప్రేమను కేవలం దొంగచాటుగా వ్యక్తపరిచే జంటలు కూడా ఉన్నాయి .
ఇంకొంతమంది తమకు నచ్చిన స్టైల్ లో లవ్ ఎక్స్ప్రెస్ చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక జంట మాత్రం ఏకంగా లవ్ ప్రపోజ్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. న్యూయార్క్ టైం స్క్వేర్ సాక్షిగా తమ ప్రేమ ప్రపోజ్ ను ఆమె ముందు ఉంచి సినిమా స్టైల్ లో అందరిని ఆశ్చర్యపరిచారు కుర్రాడు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో నివసిస్తున్న ఒక ఇండియన్ కుర్రాడు అయిన పార్థ్ మానియార్ తన ప్రేయసికి వినూత్నంగా తన ప్రేమ విషయాన్ని తెలియజేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద తన ప్రియురాలు శ్రేయా సింగ్ కు వినూత్నంగా లవ్ ప్రపోజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా నిలిచారు. ఇకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాను తలపించారుగా అంటూ వీరిని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే.. వీడియోలో.. శ్రేయా సింగ్ కి తన స్నేహితురాళ్ళు కళ్లకు గంతలు కట్టి తీసుకురాగా.. పార్థ్ తన స్నేహితులతో కలిసి న్యూయార్క్ టైమ్స్ వద్ద బాలీవుడ్ స్టైల్ లో డాన్స్ చేస్తూ తన ప్రేమను వ్యక్తపరిచారు అనంతరం అతడి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకొని డాన్స్ చేశారు. దీంతో శ్రేయ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలీవుడ్ మూవీ ని చూసినట్లుందని కొంతమంది నెటిజనులు కామెంట్లు పెడుతుంటే.. మరి కొంతమంది పర్ఫెక్ట్ లవ్ ప్రపోజల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఎంతోమంది కలలను ఈ కొత్తజంట నిజం చేశారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సాక్షిగా ఈ స్నేహితులు కాస్త ప్రేమబంధంలోకి అడుగుపెట్టి అందరిని అబ్బురపరుస్తున్నారు.
