Begin typing your search above and press return to search.

కెనడాలో పంజాబ్ యువతి హత్య.. కారణం అతడేనా..?

ఉన్నత చదువులో.. ఉద్యోగాలో ఏదో ఒక కారణంతో చాలా మంది తాము పుట్టిన ప్రాంతం.. దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్తుంటారు.

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 8:00 PM IST
కెనడాలో పంజాబ్ యువతి హత్య.. కారణం అతడేనా..?
X

ఉన్నత చదువులో.. ఉద్యోగాలో ఏదో ఒక కారణంతో చాలా మంది తాము పుట్టిన ప్రాంతం.. దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ అక్కడ కూడా వారి ఆశలు నెరవేరకపోగా.. ప్రాణం పోతే.. అది మనసును మెలిపెట్టే భయంకరమైన బాధ. అలాంటి ఘటనలు చాలానే జరుగుతుంటాయి. దుబాయ్ లో చాలా మంది భారతీయులు సూసైడ్ చేసుకోవడమో.. లేదంటే అనారోగ్యంతో మరణించడమో దాదాపుగా రోజు లాగానే వార్తల్లో కనిపిస్తుంది. ఇది విన్నప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. ఇటీవల పంజాబ్ కు చెందిన ఒక యువతి కెనెడాలో శవంలా కనిపించింది. కన్నవాళ్లు గుండెలవిసేలా రోధించడం పలువురిని కలిచివేసింది.

పంజాబ్ యువతి దారుణ హత్య..

పంజాబ్ కు చెందిన యువతి అమన్‌ప్రీత్ సైనీ (27) కెనడాలో దారుణ హత్యకు గురైంది. సంగ్రూర్‌కు చెందిన ఆమె కొన్ని సంవత్సరాలుగా టొరంటోలో నివస్తోంది. అక్టోబర్ 23న ఒంటారియోలోని లింకన్ ప్రాంతంలోని చార్లెస్ డేలీ పార్కులో ఆమె శరీరం తీవ్ర గాయాలతో విగతజీవిగా కనిపించింది. నియాగ్రా రీజనల్ పోలీస్ సర్వీస్ (NRPS) ప్రకారం.. ఇది సెకండ్-డిగ్రీ మర్డర్, టార్గెటెడ్ అటాక్‌ నఅి భావిస్తున్నారు. అనుమానితుడిగా బ్రాంప్టన్ రెసిడెంట్‌ కలిగిన మరో భారతీయుడైన మన్‌ప్రీత్ సింగ్ (27) అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమన్ ప్రీత్ మరణం తర్వాత మన్ ప్రీత్ కెనడా వీడి భారత్‌కు పారిపోయినట్లు అక్కడి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీంతో కెనడా-వైడ్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారు. అలాగే అమన్‌ప్రీత్ సైనీ కూడా కెనడా వెళ్లింది. అక్కడ టొరంటోలో స్థిరపడింది. అమన్ ప్రీత్ మృతదేహం చార్టెస్ డేలీ పార్కు సమీపంలో కనిపించింది. మన్ ప్రీత్ సింగ్, అమన్ ప్రీత్ సింగ్ మధ్య గొడవ కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్, విట్నెస్ స్టేట్‌మెంట్స్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ అలర్ట్‌లు జారీ చేశారు.

మన్ ప్రీత్ పై అనుమానాలు..

మన్‌ప్రీత్ సింగ్ పారిపోవడం ఈ కేసును మరింత సంక్లిష్టం చేసింది. బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అతడు.. పంజాబ్ నేపథ్యం కలిగినవాడు. కెనడా పోలీసులు అతని ఫోటో విడుదల చేసి, పబ్లిక్‌ను అప్‌డేట్ చేశారు. భారత అధికారులను సంప్రదించారు. ఇది ఎక్స్‌ట్రాడిషన్ ప్రాసెస్‌ను ఆరంభిస్తుంది. కానీ భారత-కెనడా రిలేషన్స్ టెన్షన్స్ (కొన్ని డిప్లొమాటిక్ ఇష్యూస్) వల్ల డిలే జరగవచ్చు. భారత విదేశాంగ శాఖ (MEA) ఇలాంటి కేసుల్లో సహకరిస్తుంది. కానీ అంతర్జాతీయ చట్టాల అమలు సమయం తీసుకుంటుంది.

వైరల్ గా మారుతున్న ‘#JusticeForAmanpreet’

కెనడాలో పంజాబీల సంఖ్య రాను రాను పెరుగుతోంది. 2021 సెన్సస్ ప్రకారం.. 8 లక్షల మంది పంజాబీలు అక్కడ నివసిస్తున్నారని తెలిసింది. యువతులు ఒంటరిగా, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, డిస్ప్యూట్స్ వయలెన్స్‌కు మారుతున్నాయి. భారత ప్రభుత్వం ప్రవాసీలకు హెల్ప్‌లైన్లు, అవగాహనా క్యాంపెయిన్లు నడుపుతోంది. కానీ ఇలాంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ ఎక్స్‌ట్రాడిషన్ అవసరం. కెనడా పోలీసులు ఇంటర్నేషనల్ అలర్ట్‌లు జారీ చేసినప్పటికీ, సస్పెక్ట్ భారత్‌కు చేరుకోవడం అంతర్జాతీయ బార్డర్ కంట్రోల్ లోపాలను చూపిస్తుంది. X పోస్టుల్లో, పంజాబ్ కమ్యూనిటీలు ‘#JusticeForAmanpreet’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు, ప్రవాసీ సేఫ్టీపై చర్చలు రేకెత్తిస్తున్నాయి.