Begin typing your search above and press return to search.

అమెరికాలో అగ్ని కీలలు.. ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

అగ్నిప్రమాదాలు తగ్గడం లేదు. అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా.. ఇండియా అయినా అంటుకుంటే బుగ్గి అవుతోంది.

By:  A.N.Kumar   |   5 Dec 2025 10:27 PM IST
అమెరికాలో అగ్ని కీలలు.. ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
X

అగ్నిప్రమాదాలు తగ్గడం లేదు. అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా.. ఇండియా అయినా అంటుకుంటే బుగ్గి అవుతోంది. ఇటీవలే హాంకాంగ్ అపార్ట్ మెంట్లలో జరిగిన అగ్ని ప్రమాదంలో 300 మందికి పైగా అసువులు బాసిన సంఘటనలు మనం మరిచిపోలేదు. అలాంటి ప్రమాదాల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తాజాగా అమెరికాలోని అలబామా బర్మింగ్ హామ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించబడ్డారు.

మృతిచెందిన వారిలో ఉడుముల సహజరెడ్డి, కూకట్ పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.

మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కారణాలు తెలిస్తే కానీ ప్రమాదం ఎలా జరిగింది? తీవ్రత ఎంత ? ఇంకా బాధితుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక తెలుగు విద్యార్థుల మృతితో తెలుగు రాష్ట్రాల్లో వారి కుటుంబాల్లో విషాద చాయలు కమ్ముకున్నాయి.