Begin typing your search above and press return to search.
మిర్చిలాంటి కుర్రాడు

Date of Release: 2015-07-31
రేటింగ్: 2.25/5.0
నటీనటులు: అభిజిత్, ప్రగ్యా జైస్వాల్, రావు రమేష్, సప్తగిరి, సుప్రీత్, నాగినీడు, షకలక శంకర్, జబర్దస్థ్ శ్రీను, ప్రభాస్ శ్రీను, సోఫియా, నల్ల వేణు, రఘు తదితరులు
సంగీతం: జె.బి.
ఛాయాగ్రహణం; ఆర్.ఎం.స్వామి
నిర్మాత: రుద్రపాటి రమణారావు
దర్శకత్వం: జయ నాగ్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రామ్ లీల సినిమాలతో వెండితెరపై కనిపించిన అప్ కమింగ్ హీరో అభిజిత్... ఈసారి సోలోగా ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నూతన దర్శకుడు జయ నాగ్ తన తొలి చిత్రాన్ని ఓ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ప్రేకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాతోనే హీరోయిన్ ప్రగ్నాజైశ్వాల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. లయన్ లాంటి ఓ పెద్ద సినిమాని నందమూరి బాలయ్యతో నిర్మించి... ఇప్పుడు ఓ చిన్న సినిమాను నిర్మించారు నిర్మాత రుద్రపాటి రమణారావు. అప్ కమింగ్ తారలు, టెక్నీషియన్స్ తో నిర్మించిన ‘మిర్చిలాంటి కుర్రాడు’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ కుర్రాడి ఘాటు ఏమాత్రం తగిలిందో చూద్దామా!
కథ:
అమీర్ పేటలో చదువుకుంటూ... మధురానగర్ లో వుండే ఓ ప్రైవేటు హాస్టల్ లో వుండే ముగ్గురు కుర్రాళ్లు... ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తూ వుంటారు. అందులో సిద్ధూ(అభిజిత్) అనే కుర్రాడు.. చదువుకుంటూ.. అనాథ పిల్లల క్షేమం కోసం పాటు పడే అమ్మాయి వసు(ప్రగ్నా జైశ్వాల్) ప్రేమలో తొలి చూపులోనే పడతాడు. అలాగే తన ఇద్దరు మిత్రలు అవతారం(షకలక శంకర్), జబర్దస్థ్ శ్రీనులు ఇద్దరు కూడా తలా ఓ అమ్మాయి ప్రేమలో పడతారు. అయితే అవతారం మాత్రం తన ప్రేమకోసం ఒంటిమీదున్న బంగారం అమ్మేసి.. ప్రేయసికి ఖర్చు పెట్టి అప్పులపాలవుతాడు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోతారు. అవతారానికి మద్దతుగా సిద్ధూ, జబర్దస్త్ శ్రీనులిద్దరూ తమ ప్రియురాళ్లకు దూరమవుతారు. దాంతో.. ముగ్గరు ప్రేమలు బ్రేక్ అప్ అవుతాయి. మరీ ఈ ముగ్గురూ కలిసి మళ్లీ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అందుకు వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. ఇది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం విశ్లేషణ:
హైదరాబాద్ లోని అమీర్ పేట్ అంటే సాఫ్ట్ వేర్ కోర్సులకు అడ్డా. ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో వచ్చి... సాఫ్ట్ వేర్ కోర్సులను చేస్తుంటారు. వీటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. దాంతో పాటు అమీర్ పేట్ లో చదువుకునే అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిల జేబుకు చిల్లు పెడుతుంటారని, వారి ప్యాకెట్ మనీ అంతా సోకులకు, షికార్లకు, షాపింగులకు ఖర్చుపెట్టేయిస్తుంటారని ఇప్పటికే చాలా స్టోరీలొచ్చాయి. అంతేనా ఇక్కడ చదువుకునే అమ్మాయిలు ఒకరు కాదని ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేస్తూ.. డ్యుయెల్ సిమ్ లు వాడుతుంటాని.. మరీ వారిని వాంప్ ల్లాగా చూపించారు. మరోసారి కొత్త దర్శకుడు జయ నాగ్ కూడా.. అమీర్ పేట్ బేస్డ్ స్టోరీని ‘మర్చిలాంటి కుర్రాడు’ సినిమాకు ఎంచుకున్నాడు. మరి ఇంతకు ముందొచ్చిన వాటి కంటే ఈ చిత్రాన్ని భిన్నమైన కథతో తెరకెక్కించాడా అనేది ఓ సారి చూద్దాం.
ఆల్రెడీగా చెప్పిన కథను ఎన్నుకునేటప్పుడు కథనాన్నైనా కాస్త భిన్నంగా నడిపించాలి. లేకుంటే... ఇంతకు ముందు చూసిన సినిమా తాలూకు సీన్లు మనకు గుర్తొచ్చి... అదేంటి మరోసారి అదే కథనే చూస్తున్నామే అనే ఫీలింగ్ కలిగి ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యే అవకాశం వుంటుంది. మిర్చిలాంటి కుర్రాడులో ఇలాంటి సీన్లు మనకు బోలెడన్ని కనిపిస్తాయి. హాస్టల్లో వుంటూ... ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పాకెట్ మనీతో అమ్మాయిలతో జల్సా చేయడం.. అది కాస్త అయిపోగానే.. అప్పులు చేయడం.. చివరకు డబ్బులు అయిపోగానే హ్యాండిచ్చే అమ్మాయిలను చూపించి.. ఆ తరువాత తమ తప్పు తెలుసుకుని ప్రేమికులంతా ఒక్కటవ్వటంలాంటి సీన్లు ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇందులో కూడా ఇలాంటివే కనిపిస్తాయి. అబ్బాయిలు.. అమ్మాయిలతో విడిపోయిన తరువాత... వారి హాస్టల్స్ లోకి దూరి.. వారిని భయపెట్టడం ఆ తరువాత దాన్ని పసిగట్టిన అమ్మాయిలు దానికి రివేంజ్ తీర్చుకోవడం లాంటివి చాలానే ఇంతకు ముందు చశాం. అచ్చంగా ఇలాంటి దృశ్యాలు ఈ మూవీలో కూడా మనకు కనిపిస్తాయి. మరి దర్శకుడు కొత్తగా ఏం చెప్పాడు అంటే... ఏమీ చెప్పలేదు.. ఓ సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వదిలాడు అంతే.
రుద్రపాటి రమణారావు లాంటి సినిమా ఫ్యాసినేట్ అవకాశం ఇచ్చినప్పుడు ఎంత మంచి సినిమా ఎన్నుకొని తీయాలి. ఈ అవకాశం మరో పది సినిమాలైనా తీసేలా ఉపయోగించుకుని ఓ సినిమా తీయడానికి కొత్త దర్శకుడు సమాయత్తమవ్వాలి. ఈ చిత్ర దర్శకుడు జయనాగ్ అలాంటి హోం వర్క్ ఏమీ చేయలేదు. ఏదో అవకాశం వచ్చింది... చేతిలో వున్న స్క్రిప్టును ఓ సినిమాను తీసేద్దాం అనే చుట్టేశాడు. జబర్దస్థ్ కామెడీ షోతో పాపులర్ అయిన షకలక శంకర్, శ్రీను, వేణు, రఘులను సపోర్టింగ్ క్యారెక్టర్ల కింద తీసుకుని మెయిన్ హీరోతో రెండు ఫైట్లు.. రెండు సోలో పాటలతో సినిమాని లాగించేద్దాం అనుకున్నాడు. దానికి ఓ వైవిధ్యమైన స్క్రీన్ ప్లే గానీ... బలమైన అదనపు సీన్లను గానీ ఏ మాత్రం యాడ్ చేసుకోకుండా.. సినిమాను సాదా సీదాగా తెరకెక్కిచేశాడు. మరి ఇలాంటి రొటీన్ ఫార్ములా మూవీని జనాల్లోకి వదిలితే.. ఎలా చూస్తారా అనేది కూడా ఆలోచించలేదు. కేవలం కంప్లీట్ అయిన సినిమాను థియేటర్లలోకి వదిలేస్తే చాలు తన పనైపోద్ది అనుకున్నాడు దర్శకుడు.
పైగా రావు రమేష్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేకపోయాడు. గతంలో ఇలాంటి పాత్రల్లో ప్రకాష్ రాజ్ జీవించేశారు. యూత్ ని సన్మార్గంలో నడిపించే బలం ఉన్న క్యారెక్టర్‌ను పెట్టకున్నప్పుడు.. అందుకు తగ్గట్టుగానే డైలాగులు, సన్నివేషాలు రాసుకోవాలి. కేవలం ఏదో తన హాస్టల్లో వున్న కుర్రాడు... ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడితే.. అమ్మాయి తండ్రి వచ్చి ఆకుర్రాడిని దండించడం.. అక్కడ రావు రమేష్ ఎంటర్ అయ్యి... ‘పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తోంది ప్రభుత్వం.. అలాగే యవ్వనంలోకి వచ్చిన ప్రతి యువకునికి ప్రేమించే హక్కు వుందని చెప్పడం’ బాగుందే కానీ.. సీను బలంగా పండలేదు. అదే సందర్భంలోనే... మీరు మంచి ఉద్యోగాలు సంపాదించండి.. అమ్మాయిల వెంట మీరు పడటం కాదు.. అమ్మాయిల తల్లిదండ్రులే మా అమ్మాయిని చేసుకోండని మీ వెంటపడతారనే’ డైలాగూ వుంది. ఇంతకు ముందు ఇదే డైలాగు చాలా సినిమాల్లో మనం వినుంటాం. పైగా ఇప్పడు ఫేస్ బుక్, వాట్స్ ఫ్ చాటింగ్ లతో పుట్టే ప్రేమలెక్కువ. అందుకు తగ్గట్టుగానే సినిమా కథ కూడా చాలా పార్ష్ గా వుండాలి. అప్పుడే నేటి యువత కనెక్ట్ అవుతుంది. దానికి నాలుగు కాసులు రాలుతాయి. ఇంకా పదేళ్ళ కిందటి డైలాగులను చెబుతూ పోతే... నేటితరం యువతకు ఎక్కేకాలం కాదిది. దర్శకుడు అందులో చాలా వెనుకబడేవున్నాడు. ఇందులో ఒ.ఎల్.ఎక్స్.యాప్ గురించి కూడా ఓ ఎగుటు పుట్టించే కామెడీ సీన్ వుంది. దాన్ని బట్టే అర్థం అవుతుంది కేవలం ఆ యాప్ పబ్లిసిటీ కోసమే... ఆ సీన్ రాసుకున్నాడని. ఇలాంటి బ్రాండింగ్ ఈ మూవీలో చాలానే చేసేశారు.
నటీ నటులు:
అభిజిత్.. ఓ రకంగా చూస్తే... అతను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ల్లోనే బాగా నటించాడనిపిస్తుంది. అందులోని క్యారెక్టరైజేషన్ చాలా కూల్‌గా వుంటుంది. ఆ క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం కూడా యూత్ కి బాగానే కనెక్ట్ అయింది. మిర్చిలాంటి కుర్రాడు అనే టైటిల్ అయితే ఏదో మాస్ గా వుంది కానీ... ఇందులో రెండు మూడు చిన్న చిన్న ఫైట్లు తప్ప అంతగా మాస్ ను ఆకట్టుకునే సీన్లమీ లేవు. పైగా సుప్రీత్ లాంటి భారీ పర్సనాలిటీతో ఫైట్లు చేయిండం కూడా అంతగా సింక్ అవ్వలేదు. ఏదో కాలేజీ గొడవలు, వీధి ఫైట్లులాంటి పెట్టుంటే బాగుండేది కానీ... హెవీ పర్సనాలిటీలను డీల్ చేసేంత బాడీ లాంగ్వేజ్ అభిజిత్ కి లేదని దర్శకుడు గ్రహించలేకపోయాడు. పాటల్లో అభిజిత్ డ్యాన్స్ బాగుంది. ఇంకా ట్రై చేస్తే బెటర్ అవుట్ పుట్ ఇవ్వగలడు. ఇప్పుడొస్తున్న హీరోలలో నాగశౌర్యకు ధీటుగా తయారు కాగలడు. సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ సినిమాలకు సూట్ అవుతాడేమో గానీ... నటనలో ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇందులో తన సొంత గొంతులా లేదు. లిప్ సింక్ చూస్తుంటే.. ఎవరో డబ్బింగ్ చెప్పినట్టే కనిపిస్తుంది. ఓన్ డిక్ష న్ని ఇంప్రూవ్ చేసుకుంటే తొందరగానే కనెక్ట్ అవుతాడు. హీరోయిన్ ప్రగ్నా జైశ్వాల్ ఏమాత్రం నటన కనబరచలేదు. ఆమెను చూసినప్పుడల్లా.. బొమ్మలాగే కనిపిస్తుంది. ఏమాత్రం ఎక్స్ ప్రెషన్స్ లేకుండా అలా నటించేసింది. కేవలం లిప్ మూవ్ మెంట్లతోనే నెట్టేయొచ్చు అనుకున్నట్లుంది. ఇందులో కమెడియన్ షకలక శంకర్, జబర్దస్థ్ శ్రీను హీరోతో పాటు చివరి దాకా నటించారు. వీరిలో షకలక శంకర్ క్యారెక్టర్ హైలైట్. డైలాగులు చెప్పడంలో గానీ... రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలోగానీ బాగా నటించాడు. రఘు, సప్తగిరి కాసేపే వున్నా పర్వాలేదు అనిపించారు. సుప్రీత్ క్యారెక్టర్ కొంచమే. నాగినీడు కూడా క్లైమాక్స్ వస్తాడు హీరోయిన్ తండ్రిగా. అలాగే పృథ్వీ(థర్టీ ఇయర్ ఇండస్ట్రీ) చివర్లో కనిపించాడు. కేవలం కాస్టింగ్ కోసమే వీరిని ఉపయోగించుకున్నారు.
సాంకేతిక వర్గం:
నూతన దర్శకుడైనా నిర్మాణ విలువల్లో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. సినిమాను క్వాలిటీగా అయితే తెరకెక్కించాడు. కథ, కథనమే వీక్. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సంభాషణల గురించి. షకలక శంకర్ సంభాషణలు హైలైట్. నా వద్ద గోల్డ్ వుంటే ముత్తూత్ కు పోదును.. బైకుంటే రామ్ కోటికి పోదును.. మీ వద్దకు ఎందు కొస్తా, ఒంటినిండా నగలతో.. నగల దుకాణంలాగ వుండేటోణ్ని.. దోచేసిన దుకాణంలా ఎలా తయారయ్యానో చూడు లాంటి డైలాగులు బాగున్నాయి. అలాగే హీరో కూడా ఫండ్స్ ఇచ్చాం కదా అని ఫ్రెండ్ షిప్ చేయడం... దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రేమిస్తున్నాననడం నాకు నచ్చదు లాంటి సంభాషణలను వీరబాబు బసిన బాగా రాశారు. జె.బి. అందించిన పాటలు సో...సో..గా వున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎప్పుడూ ప్రవీణ్ పూడి... ఎడిటింగ్‌ని బాగా చేస్తారనే ప్రచారం వుంది. మరి ఎందుకో ఇందులో ఆ బిగి కనిపించలేదు. మరో పాతిక నిమిషాలు కట్ చేసినా పోయిది ఏమీ లేదు. ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వ కుండా చూస్తారు. కెమెరా పనితనం పెద్దగా చెప్పకోవాల్సింది లేదు. పాటల చిత్రీకరణ గానీ.. కొత్తమ్మాయి హీరోయిన్ ని గానీ.. ప్రత్యేకంగా చూపించింది ఏమీ లేదు.
చివరగా: ఘాటులేని మిర్చిలాంటి కుర్రాడు
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre