Begin typing your search above and press return to search.
7:11 PM

Date of Release: 2023-07-07
సంగీతం : గ్యాని
సినిమాటోగ్రఫీ : శివ శంకర్ వర్మన్
రైటర్- డైరెక్షన్ : చైతు మాదాల
నిర్మాత : నరెన్ యనమదల, మాధురి రావిపాటి
కొత్త కొత్త ప్రయత్నాలు చేయడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. ఈమధ్య యువ దర్శకులంతా కూడా తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి భయాలు లేకుండా ధైర్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే యంగ్ టీం అంతా కలిసి చేసిన సినిమా 7:11 PM. ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.. ఇదివరకు ఎప్పుడూ టచ్ చేయని ఒక కొత్త కథతో ఈ సినిమా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
1999 హంసలదీవి లో ఉంటున్న రవి (సాహస్) ఐ.పి.ఎస్ అవ్వాలని అనుకుంటాడు. అతను విమల (దీపిక) తో ప్రేమలో పడతాడు. ఊరు ప్రజల బాగు కోరే రవి వారిని ఆ ఊరి సర్పంచ్, మినిస్టర్ నడిపిస్తున్న చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్న మోసాల గురించి ఎదురు తిరగాలి అనుకుంటాడు. ఆ టైం లో రవి ఓ బస్ ఎక్కుతాడు. ఆ బస్ టైం ట్రావెల్ గా మారి అతన్ని 2024లోకి తీసుకెళ్తుంది. 1999 టూ 2024 టైం ట్రావెల్ లో ఎలా వెళ్లాడు..? ఊరి ప్రజల కోసం పోరాడాలని అనుకున్న రవి ఆ టైం లో ఏం చేశాడు..? పాతికేళ్ల క్రితం ఉన్న హంసలదీవి ఇప్పుడు ఎలా ఉంది..? వీటన్నిటికి సమాధానమే ఈ సినిమా.
కథనం - విశ్లేషణ :
తెలుగులో చాలా తక్కువగా వచ్చిన జోనర్ ఏదైనా ఉంది అంటే అది సైన్స్ ఫిక్షన్ సినిమాలే అని చెప్పొచ్చు. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఇలాంటి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కథలతో సినిమాలు వస్తాయి. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు 1991లోనే ఆదిత్య 369 సినిమా తీసి శభాష్ అనిపించారు. ఆ తర్వాత కూడా టైం ట్రావెల్ సినిమాలు వచ్చినా ఆ స్థాయిని దాటలేదని చెప్పొచ్చు. టైం ట్రావెల్ కథలకు ఎక్కువ బడ్జెట్ అవసరం పడుతుంది. కథ, కథనాలు అన్ని పర్ఫెక్ట్ గా కుదరాలి. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా సరే సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది.
7:11PM సినిమా కూడా టైం ట్రావెల్ కథతో తెరకెక్కించారు. ప్రయత్నం బాగానే ఉంది కానీ చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యారు. సినిమా మొదలు పెట్టగానే 2024 నుంచి 1999 కి ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ అవుతుంటారు. ఇక మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా వాయిస్ ఓవర్ తో చూపిస్తారు. ఇంకా ఆడియన్స్ కి రిజిస్టర్ అవకుండానే వారు చాలా హడావిడి చేసేస్తుంటారు. పాత్రల పరిచయం విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక థ్రెడ్ నుంచి మరో థ్రెడ్ కి జంప్ అవుతుంది. దీని వల్ల ఆడియన్స్ కి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆల్రెడీ టైం ట్రావెల్ ఒక పక్క చూపిస్తూ మరోపక్క హీరో లవ్ స్టోరీ.. పొలిటిషియన్ స్కాం ఇలా అన్ని ఒకేసారి జరుగుతుంటాయి. ఈ సన్నివేశాలను ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు దర్శకుడు.
ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ మీద కొంత ఆసక్తి కలిగేలా చేసినా సెకండ్ పార్ట్ 2024 లోకి షిఫ్ట్ అవ్వడం.. అక్కడ హీరో ఏం చేయాలో తెలియక.. అతను తిరిగి ఎలా వెళ్లాలో తెలియక చూపించిన విధానం అంత కన్విన్స్ గా అనిపించలేదు. చాలా చోట్ల ఓవర్ డ్రమెటిక్ డైలాగ్ సెకండ్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టించేస్తాయి. సినిమాలో కొన్ని సీన్స్ నిడివి ఎక్కువ అయ్యేందుకు ఉపయోగపడింది తప్ప సినిమాకు అవి ఏమాత్రం యూస్ అవలేదు. ఫస్ట్ హాఫ్ లో సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలన్నిటికీ సెకండ్ హాఫ్ లో ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటారు. కానీ దర్శకుడు అదంతా చివరి 10, 15 నిమిషాల్లో తేలకొట్టేయడం హడావిడిగా అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా కన్విక్షన్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. చివరి 20 నిమిషాలు తప్ప సెకండ్ హాఫ్ మొత్తం చాలా స్లోగా ఆడియన్స్ పేషన్స్ ను టెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. హీరో తెర మీద ఎమోషన్స్ పండిస్తున్నా ఆడియన్స్ ఆ సీన్స్ కి కనెక్ట్ అవలేరు. సినిమా మొదటి నుంచి ఇలా జరగడం పెద్ద మైనస్ గా మారింది.
7:11 PM విషయంలో మేకర్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి యూనిక్ థీం తో సినిమా తీసినందుకు ప్రశంసించాల్సిందే. కథ ఎంత బాగున్నా కథనం సరిగా లేకపోతే సినిమా ఆడియన్స్ కు రీచ్ అవదు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్ లు, టెక్నిషియన్స్ అందరు తమ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా సరే సినిమా ఆశించిన స్థాయి అందుకోలేదు. సినిమాలోని లాజిక్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే ప్రేక్షకులకు రీచ్ అయ్యేది.
నటీనటులు :
రవి పాత్రలో సాహస్ పగడాల ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. ఆన్ స్క్రీన్ అతని లుక్స్ బాగున్నాయి.. చాలా సీన్స్ లో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త పరిణితి రావాల్సి ఉంది. దీపికా రెడ్డి బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. హీరోయిన్ పాత్రలో డెప్త్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. టెస్ వాల్ష్ పాత్ర ఎక్స్ ప్రెసివ్ గా చూపించారు. ఆమె కూడా తన పాత్రకు పరిది మేరకు నటించింది. టెస్ వాల్ష్ తండ్రి పాత్రలో నటించిన అతను కూడా మెప్పించాడు. భరత్ రెడ్డి పాత్ర ప్రెడిక్ట్ చేసేలా ఉంది. అతనికి తక్కువ స్క్రీన్ టైం దొరికింది. మిగతా స్టార్ కాస్ట్ రఘు, రైజింగ్ రాజు, మారినా, వాసు, చరణ్, లియో వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
7:11 PM లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందించిన సినిమా. అయినా సరే సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం తమ బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేశారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది.. అయితే రెండు సాంగ్స్ ప్లేస్ మెంట్ సరిగా అనిపించదు. విజువల్స్ చాలా బాగున్నాయి.. కొన్ని లిమిటేషన్స్ ఉన్నా ఉన్నంతలో బాగానే చేశారు. విలేజ్ సీన్స్ బాగా వచ్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది సబ్ ప్లాట్స్ ఎక్కువవడం.. సెకండ్ హాఫ్ స్లో అవడం ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడింది. సినిమా ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా అంత గొప్పగా అనిపించవు. అయితే బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.
7:11 PM రైటర్ డైరెక్టర్ చైతు మాదాల ఒక ఆసక్తికరమైన కథతో వచ్చినా కథనం విషయంలో పొరపాట్ల వల్ల సినిమా తేలగొట్టేశాడు. సినిమాలో సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉండటం వాటిని దర్శకుడు సరిగా ఎండ్ చేయకపోవడం అసంతృప్తిగా అనిపిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ కూడా ఒక డ్రా బ్యాక్ అని చెప్పొచ్చు. యూనిక్ కథతో వచ్చినా సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల మెప్పించలేదు.
చివరగా : కథ బాగున్నా.. కథనం కుదరలేదు..!
రేటింగ్ : 2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater