ఆ స్టార్ హీరో వెంట యువ నిర్మాత చెప్పులరిగేలా?

Sat Jul 02 2022 07:00:01 GMT+0530 (IST)

young Producer on star hero

ఇటీవలే ఓ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి వరకూ టాలీవుడ్ లోనే స్టార్. ఆ ఒక్క హిట్ అన్ని భాషల్లోనూ గుర్తింపు దక్కింది. తొలి ప్రయత్నం హిందీలో  బెడిసి కొట్టినా..మలి ప్రయత్నంలో కాస్తోకూస్తో పర్వాలేదనిపించాడు. అంతా ఆ స్టార్ మేకర్ చలవే. దీంతో ఆ హీరో మార్కెట్ రెట్టింపు అయింది. తెలివిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ లో ఉండగానే మరో పాన్ ఇండియా మేకర్ సీన్ లోకి తెచ్చారు.అతనితో ఓ యూనిర్శల్  స్ర్కిప్ట్ ని సిద్దం చేయించి లాక్ చేసాడు. ప్రస్తుతం ఆ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా సెట్స్ లో ఉంది. కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది.

ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మరో యువ మేకర్ ని సైతం తదుపరి ప్రాజెక్ట్ కోసం లైన్ లో పెట్టేసాడు. తాజా ప్రాజెక్ట్ పూర్తికాగానే ఆ సినిమా సె ట్స్ కి తీసుకెళ్లడమే.

ఇలా వ్యక్తిగతంగా కెరీర్ పై ఇంత ఫోకస్డ్ గా పనిచేస్తున్నా..అతని చుట్టూ తిరుగుతోన్న ఓ యువ ఎన్ ఆర్ ఐ  నిర్మాతకి మాత్రం డేట్లు కేటాయించలేదు అన్న టాపిక్ మరోసారి చర్చకు దారి తీసింది. ఆ యువ నిర్మాత సదరు స్టార్ హీరో చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నాడు. ఆయనకు సపోర్ట్ గా మరో కీలక వ్యక్తి కూడా ఉన్నాడు.

ఆ ఇద్దరు కలిసి ఆ స్టార్ ఎక్కడ కనిపించినా అతన్ని వెంబడిస్తున్నారు. దాదాపు రెండేళ్లగా ఈ తంతు సాగుతోంది. కానీ ఆ స్టార్ ఇంకా నిర్మాతపై కరుణించలేదు. తిరిగి తిరిగి కాళ్లకి  వేసుకున్న చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప! ఏ విషయం తేల్చడం లేదు. చేస్తానని చెప్పడం లేదు?  చేయనని చెప్పడం లేదుట. అడిగితే అటు ఇటూ కాని సమాధానం వస్తోందిట.

తాజా ప్రాజెక్ట్ లోనైనా భాగస్వామ్యం కల్పిస్తాడని ఆశలు పెట్టుకున్నా చివరికి అవి కూడా అడియాశలగానే మిగిలిపోయాయని సమాచారం.  అతని చుట్టూ రోజు గ్యాంగ్ ని వేసుకుని తిరగడం ..అవనసరంగా డబ్బులు ఖర్చు తప్ప ఇంత వరకూ ఒక్క శాతం కూడా ఎలాంటి ఫలితం లేదని  సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నాడుట.  మరో ఆరు నెలలు పాటు చూసి ఇక ఆ  హీరోకి గుడ్ బై చెప్పేంత విసుగు చెందినట్లు టాక్ వినిపిస్తుంది.