Begin typing your search above and press return to search.

'పుష్ప‌' పాట‌కు త‌మిళ హాటీ స్టెప్పులు

By:  Tupaki Desk   |   19 Jan 2022 8:31 AM GMT
పుష్ప‌ పాట‌కు త‌మిళ హాటీ స్టెప్పులు
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ ని ఓ ఊపు ఊపేసింది. ఊహించని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్టాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది. ద‌క్షిణాదిలో రెండు భాష‌ల్లో సూప‌ర్ హిట్ గానూ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గానూ సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ క్రేజ్ అంతా ఇంతా కాదు.

సినిమా విడుద‌లై నెల రోజులుగా దాటుతున్నా.. ఓటీటీలో విడుద‌లై వారం దాటినా ఈ మూవీపై క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. దేశ వ్యాప్తంగా ఈ మూవీ డైలాగ్ తో పాటు పాట‌లు పాపుల‌ర్ అవుతున్నాయి. మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్లు ఈ మూవీ డైలాగ్ ల‌కు డ‌బ్‌ష్మ‌ష్ వీడియోలు చేసేస్తూ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా ఇందులోని `సామీ సామీ..` పాట‌కు స్టెప్పులేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

సెల‌బ్రిటీల‌తో పాటు క్రేజీ హీరోయిన్ లు కూడా ఈ పాట‌కు స్టెప్పులేస్తూ ఆ వీడియోల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా త‌మిళ న‌టి, హాట్ గాళ్ య‌షికా ఆనంద్ `సామీ సామీ ` పాట‌కు చిందులేసింది. త‌న‌దైన స్టైల్లో లంగా ఓణీ ధ‌రించి `పుష్ప‌`లో ర‌ష్మిక మంద‌న్న పై చిత్రీక‌రించిన `సామీ.. సామీ.. ` పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

ఇప్ప‌డు ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఏదో అలా ట్రై చేశాను. కానీ నేను సాధార‌ణంగా నేనెలా డ్యాన్స్ చేస్తానో అలాగైతే చేయ‌లేదు. ఇక్క‌డికి రావ‌డానికే ఆరు నెల‌లు ప‌ట్టింది. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ డ్యాన్స్ చేస్తాను. కాక‌పోతే ఇదే ప్ర‌దేశంలో మాత్రం కాద‌ని ఈ వీడియోతో పాటు పోస్ట్ చేసింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన `నోటా` మూవీతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ప‌రిచ‌య‌మైంది య‌షికా ఆనంద్. సినిమాల్లో పాపుల‌ర్ కాక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం వ‌రుస హాట్ ఫొటో షూట్ ల‌కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. గ‌త ఏడాది యాక్సిడెంట్ కి గురికావ‌డంతో కొంత కాలం పాటు బెడ్ కే ప‌రిమిత‌మైన య‌షికా ఆనంద్ తాజాగా కోలుకుంది. ఇప్పుడిప్పుడే త‌న అభిమానుల‌తో అందుబాటులోకి వ‌స్తోంది.