బాలయ్యకు భార్యగా.. ఆ ఇద్దరిలో ఎవరు?

Thu May 26 2022 10:14:35 GMT+0530 (IST)

wife of Balayya .. which of the two?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు అనిపిస్తోంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా తన తదుపరి సినిమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక మాస్ యాక్షన్ సినిమా తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది.ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి మరొక కొత్త సినిమాలు కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ కి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.

అయితే ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి భామ శ్రీలీల హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆమె బాలయ్య బాబు కూతురు పాత్రలో నటించబోతున్నారని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.

అంతే కాకుండా బాలకృష్ణ ఈ సినిమా లో 50 ఏళ్ల వయసున్న ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపించబోతున్నట్లు కూడా తెలియజేశారు.ఇక హీరోయిన్ విషయంలో కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

ఒక ఇద్దరి పేర్లను దర్శకుడు చర్చలోకి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే మొదట ప్రియమణి పేరు కూడా వినిపించింది. ఆమె అయితే బాలయ్య బాబు భార్య పాత్రలో కరెక్ట్ గా సెట్ అవుతుంది అని అనుకున్నారట.

మరొక వార్త ప్రకారం యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం యువ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ బాలయ్యతో ఛాన్స్ కొట్టేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ను జూలైలో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.