నిఖిల్ మూవీని వాయిదా వేయించిన ఆకాశరామన్న ఎవరు?

Wed Aug 17 2022 12:03:38 GMT+0530 (IST)

who postponed Nikhil's movie?

యంగ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ పీపుల్ మీడియా టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రెండు దఫాలుగా రిలీజ్ వాయిదా పడి ఫైనల్ గా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోతో యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.సినిమాలో చెప్పిన కృష్ణతత్వం ఇప్పుడు నార్త్ లో వర్కవుట్ కావడంతో అక్కడ కూడా ఈ మూవీ రికరార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ దూసుకుపోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ సమయంలో తన సినిమాని బలవంతంగా పోస్ట్ పోన్ చేయిస్తున్నారని ఓ మీడియాకు ఇచ్చిన ఇంగర్వ్యూలో సంచలన విషయాల్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. 'ఎలాంటి బ్రాగ్రౌండ్ లేని వాళ్లు సినిమా చేస్తే ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో 'కార్తికేయ 2'తో స్పష్టమైంది. బ్యాగ్రౌండ్ లేని వాళ్ల సినిమాలని రిలీజ్ టైమ్ లో పక్కకు తప్పిస్తుంటారు. అది మా సినిమా విషయంలోనూ జరిగిందని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా ఐదు రోజుల క్రితం తాను ఏడ్చానని వెల్లడించడం అప్పట్లో సంచలనంగా మారింది.

జూలై 22న డేట్ వేసుకుంటే వెనక్కి వెళ్లమన్నారని ఆ తరువాత ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తుంటే అక్టోబర్ లేదా నవంబర్ కు వెళ్లమన్నారని నిఖిల్ సదరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మీ సినిమా రిలీజ్ కాదు.. మీకు థియేటర్లు దొరకవు... మీ సినిమాకు థియేటర్లు ఇవ్వం అనే స్టేజ్ దాకా వెళ్లారనిఆ మాటలు విని ఆ రోజు తాను ఏడ్చానని చెప్పుకొచ్చాడు నిఖిల్. అయితే నిఖిల్ ని ఇంతగా బాధించింది ఎవరు? భయపెట్టింది ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.

నిఖిల్ చెప్పిన సమయాల్లో దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ'తో పాటు రిలీజ్ చేస్తున్న బింబిసార నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు మాత్రమే వున్నాయి. దాంతో అంతా దిల్ రాజు కారణంగానే నిఖిల్ మూవీని వరుసగా వాయిదా వేయించారనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా దిల్ రాజు కాస్త ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుపుకుని రాయండి లేదంటే ముసుకుని కూర్చోండి అంటూ స్పందించారు.

మీడియా వారు అడిగితే టైమ్ ఇస్తాను. నిజానిజాలు తెలుసుకుని రాయండి. మీ వ్యూస్.. క్లిక్కుల కోసం నా పేరును పాడు చేయకండి.. అసలు ఏం జరిగిందో తెలుసెకోకుండానే మీడియా రాద్దాంతం మొదలు పెట్టింది అని సెలవిచ్చారు. మరి నిఖిల్ చెప్పింది ఎవరి గురించి? .. తన సినిమా రిలీజ్ కు అడ్డుపడింది ఎవరు? .. అక్టోబర్ లేదా నవంబర్ కు రిలీజ్ మార్చుకోమని బెదిరించింది ఎవరు? ..నీ సినిమాకు థియేటర్లే ఇవ్వమని నీ సినిమా రిలీజ్ కాదని  భయ పెట్టింది ఎవరు? .. ఆకాశరామన్నా..?

నిఖిల్ మీడియా ముఖంగా చెప్పిన మాటలు అబద్ధమా? .. అంటే ఇదంతా జనాలకు.. మీడియాకు అవసరం లేదన్నమాట. అంతా ఓకే నిఖిల్ తన సినిమా రిలీజ్ ని ఆపింది దిల్ రాజు కాదు అని తనే రిలీజ్ కి సహకరించారని స్పష్టం చేశాడు. మరి 'కార్తికేయ 2' రిలీజ్ ని ఆపింది ఎవరు?.. నిఖిల్ ని బెదిరించింది ఎవరు?.. తను ఏడ్చేలా చేసింది ఎవరు? ఆకాశరామన్నా?. అని ప్రస్తుతం కొత్త చర్చ మొదలైంది.