వాల్తేరు వీరయ్య.. ఈ సైలెన్స్ ఏందయ్యా..!

Mon Dec 05 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

waltair veerayya What is this silence

ఆచార్య పూర్తిగా నిరాశపరచగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ కూడా మొదట్లో సందడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. చిరు బాక్సాఫీస్ పై మాస్ హిట్ కొట్టాలన్న కోరికని ఈ రెండు సినిమాలు నిజం చేయలేదు. అందుకే వాల్తేరు వీరయ్య మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా వాల్తేరు వీరయ్య మూవీ పైనే భారీ క్రేజ్ ఏర్పరచుకున్నారు. సినిమాలో చిరుతో పాటుగా రవితేజ కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ ఏర్పడింది.ఎప్పుడో అన్నయ్య మూవీ టైం లో రవితేజ చిరుకి బ్రదర్ పాత్రలో చేశాడు. ఇప్పుడు మాస్ మహారాజ్ గా క్రేజ్ తెచ్చుకున్నాక మరోసారి ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సీన్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. అయితే 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్రయూనిట్ వెనకపడి ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా 40 రోజులే ఉండగా వాల్తేరు టీం ఏమాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

ఈమధ్య సినిమా నుంచి ఓ టీజర్ రాగా.. బాస్ పార్టీ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఓ పక్క సంక్రాంతికి పోటీగా వస్తున్న వీర సింహారెడ్డి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. త్వరలోనే సినిమా నుంచి ఒక సాంగ్ మరో టీజర్ కూడా వదులుతున్నారట. మరోపక్క సంక్రాంతికి వస్తున్న వారసుడి హంగామా కూడా మొదలవబోతుంది. అయితే చిరు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి మాత్రం ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా ఎనౌన్స్ చేయలేదు.

అంతేకాదు సినిమాలోని ఒకటి రెండు సాంగ్స్ ఇంకా షూట్ చేయాల్సి ఉందట. అందుకోసమే చిత్రయూనిట్ రష్యా వెళ్తుందని తెలుస్తుంది. మరి ఇంత తక్కువ టైం లో సినిమా పూర్తి చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల వల్ల షాక్ తగిలినా సరే చిరు వాల్తేరు వీరయ్య విషయంలో జరుగుతున్న ఈ లేటుని చూస్తూ ఉండిపోయారు. మరి వాల్తేరు వీరయ్య సందడి ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ మాత్రం వీరయ్య ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.