ఫ్లాప్ డైరెక్టర్ కు సపోర్ట్ గా మరో ఫ్లాప్ డైరెక్టర్!

Sun Sep 25 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

vv vinayak support puri jagannadh

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ `లైగర్`. పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు వున్నాయి. అయితే రిలీజ్ తరువాత ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.  భారీ స్థాయిలో వసూల్లని రాబడుతుందని భావించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి ఛార్మీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఈ సినిమాకు పూరి ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాథ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. నష్టాలని రకవరీ చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు పూరి ఛార్మీని నిలదీస్తున్నారంటూ వార్తలు వస్తుండటంతో వీటిపై తాజాగా దర్శకుడు వీవీ వినాయక్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వి.వి.వినాయక్ దర్శకుడు పూరి జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో పూరి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడని అదే సమయంలో `పోకిరి`తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సన్నిహితులకు మాత్రమే పూరి సామర్థ్యం తెలుసన్నారు. కొంత మంది ఎంటర్ టైన్ మెంట్ కోసం ఇలాంటి వార్తల్ని పుట్టిస్తున్నారని కానీ పూరిలో మంచి సామర్ధ్యం వుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా `లైగర్` ఫ్లాప్ తో తన జీవితం ఏమీ మారదు. గతంలో ఆయన ఎన్నో ఫ్లాపులు హిట్లు సూపర్ హిట్ లు ఇచ్చాడు.

ఫ్లాప్ లు వచ్చినప్పుడు అతని పని అయిపోయిందన్నారు. కట్ చేస్తే `పోకిరి`తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సినిమా అన్నాక అర్థిక ఇబ్బందులు సహజం. తను దీనికి ముందే సిద్ధంగా వుంటాడు. `లైగర్` వల్ల ఎంత పోయింది.. ఎంత వచ్చింది అన్నది పూరికే తెలుసు.

అయితే పోయినదాన్ని పొందలేనంత అసమర్ధుడు కాదు పూరి. మళ్లీ హిట్ కొడితే అతని గురించి మాట్లాడుకుంటారు. సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి పూరి పట్టించుకోడు ఎందుకంటే అతడు ఒక యోగి.. ధైర్య వంతుడు అంటూ పూరికి సపోర్ట్ గా నిలిచారు వి.వి.వినాయక్. దీంతో ఫ్లాప్ డైరెక్టర్ కు సపోర్ట్ గా మరో ఫ్లాప్ డైరెక్టర్ అంటూ నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.